బాదంపప్పు, పిస్తా, జీడిపప్పు, వాల్ నట్స్.. వంటి ఎన్నో రకాల నట్స్ మనకు తినేందుకు అందుబాటులో ఉన్నాయి. అవన్నీ ఆరోగ్యకరమైనవే. అందువల్ల వాటిని రోజూ ఆహారంలో తీసుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చు. అనేక ప్రయోజనాలు కలుగుతాయి. శక్తి, పోషకాలు రెండూ లభిస్తాయి. ఒక్కో రకమైన నట్స్ ను తినడం వల్ల భిన్న రకాల ప్రయోజనాలను పొందవచ్చు.
అయితే నట్స్‌ను తినడంలో చాలా మందికి కామన్‌గా ఒక సందేహం వస్తుంటుంది. వాటిని నేరుగా అలాగే తినేయాలా ? లేక కొద్దిగా పెనంపై వేయించి తినాలా ? ఎలా తింటే మంచిది ? ఎలా తినడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి ? అన్న ప్రశ్నలు వస్తుంటాయి. మరి వాటికి సమాధానాలను ఇప్పుడు తెలుసుకుందామా..!
నట్స్ టేస్టీగా, క్రంచీగా ఉండేందుకు కొందరు వాటిని కొద్దిగా పెనంపై వేయించి తింటుంటారు. పెనంపై కొద్దిగా నెయ్యి లేదా నూనె వేసి కొందరు వాటిని వేయించి తింటారు. కొందరు డ్రైగా వేయించి తింటారు. అయితే వేయించి తినే నట్స్ కు, నేరుగా తినే నట్స్ కు పోషకాల విషయంలో కొన్ని తేడాలు ఉంటాయి. నట్స్ ను వేయించడం వల్ల కొన్ని పోషకాలను కోల్పోవాల్సి వస్తుంది. అయితే వాటిల్లో ఉండే కార్బొహైడ్రేట్లు, ప్రోటీన్లు మాత్రం అలాగే ఉంటాయి. కానీ ఇతర పోషకాలను కోల్పోతాం. అయితే కొవ్వు, క్యాలరీల విషయంలో తేడాలు ఉంటాయి.
నట్స్‌ను వేయించి తినడం వల్ల వాటిల్లో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు ఆక్సిడేషన్ ప్రక్రియకు గురవుతాయి. దీంతో అవి దెబ్బ తింటాయి. అవి అనారోగ్యకరమైన కొవ్వులుగా మారుతాయి. అందువల్ల నట్స్‌ను వేయించి తినరాదు. నేరుగా అలాగే తినేయాలి.
నట్స్‌లో మోనో అన్ శాచురేటెడ్, పాలీ అన్‌శాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. నట్స్ ను వేయించడం వల్ల ఆ కొవ్వులు అధిక ఉష్ణోగ్రతలకు లోనవుతాయి. దీంతో వాటి స్వరూపం మారుతుంది. ఈ క్రమంలో హానికర ఫ్రీ ర్యాడికల్స్ తయారవుతాయి. ఇవి మన శరీరానికి మంచివి కావు. కణాలను దెబ్బ తీస్తాయి.
నట్స్ ఆక్సిడేషన్‌కు గురవడం వల్ల వాటిల్లో ఉండే కొవ్వులు హానికరంగా మారుతాయి. పైగా వేయించిన నట్స్ ఎక్కువ కాలం నిల్వ ఉండవు. నట్స్ ను వేయించడం వల్ల ఆక్రిలమైడ్ అనే సమ్మేళనం వాటిలో తయారవుతుంది. ఇది క్యాన్సర్‌ను కలగజేస్తుంది. అందువల్ల నట్స్ ను వేయించి తినరాదు. నేరుగా అలాగే తినేయాలి. ఇక బాదంపప్పును నీటిలో నానబెట్టి పొట్టు తీసి తినడం మేలు. దీని వల్ల వాటిలో పోషకాలు పెరగడమే కాకుండా వాటిని శరీరం సరిగ్గా శోషించుకుంటుంది. కనుక నట్స్ ను తినే విషయంలో ఆయా జాగ్రత్తలను పాటించాలి..!
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365