సాధారణంగా చాలా మంది భోజనం చేశాక టీ, కాఫీ వంటివి తాగుతుంటారు. భోజనం చేశాక నిద్ర వస్తుందని దాన్ని తప్పించుకునేందుకు చాలా మంది టీ, కాఫీలను సేవిస్తుంటారు. అయితే ఇలా చేయడం నిజానికి మంచిది కాదు. భోజనం చేశాక టీ, కాఫీలను తాగడం వల్ల శరీరం మనం తినే ఆహారాల్లో ఉండే ఐరన్‌ను గ్రహించలేదు. దీంతో ఐరన్ లోపం సమస్య ఏర్పడుతుంది. ఫలితంగా అది రక్తహీనతకు దారి తీస్తుంది.
అయితే భోజనం చేశాక అంతగా తాగాలనిపిస్తే విటమిన్ సి అధికంగా ఉండే నారింజ, టమాటా, ద్రాక్ష రసాలను తాగవచ్చు. దీని వల్ల శరీరం ఐరన్‌ను బాగా గ్రహిస్తుంది. భోజనం చేశాక 100 మిల్లీగ్రాముల మోతాదులో విటమిన్ సి ని తీసుకోవడం వల్ల శరీరం ఐరన్‌ను నాలుగు రెట్లు ఎక్కువగా శోషించుకుంటుందని సైంటిస్టుల అధ్యయనాల్లో వెల్లడైంది. కాబట్టి భోజనం చేశాక టీ, కాఫీలకు బదులుగా విటమిన్ సి ఉండే రసాలను తాగాలి.
ఇక భోజనం చేశాక టీ, కాఫీలను తాగాల్సి వస్తే కనీసం రెండు గంటల వ్యవధి ఉండాలని సైంటిస్టులు తెలిపారు. భోజనం చేసిన వెంటనే టీ తాగితే శరీరం ఐరన్‌ను శోషించుకునే శాతం 80 వరకు తగ్గుతుంది. కాఫీ అయితే అది 60 శాతంగా ఉంది. కనుక భోజనం చేశాక టీ, కాఫీలను తాగకపోవడమే ఉత్తమం. అంతగా తాగాలనిపిస్తే పైన తెలిపిన విధంగా విటమిన్ సి ఉండే జ్యూస్‌లను తాగాలి. లేదా రెండు గంటలు ఆగి కాఫీ, టీ లను తాగవచ్చు. దీంతో ఐరన్ లోపం సమస్య ఏర్పడకుండా ఉంటుంది.
అయితే విటమిన్ సి విషయానికి వస్తే నిమ్మ, కివీ, ద్రాక్ష, బొప్పాయి వంటి ఇతర ఆప్షన్లు కూడా ఉన్నాయి. అందువల్ల వీటిని కూడా తీసుకోవచ్చు. లేదా వీటి రసాలను తాగవచ్చు.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365