అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

Depression: డిప్రెష‌న్‌తో బాధ‌ప‌డుతున్నారా ? అయితే వీడియో గేమ్స్ ఆడండి..!

Depression: ప్ర‌స్తుతం త‌రుణంలో డిప్రెష‌న్ బారిన ప‌డి చాలా మంది బాధ‌ప‌డుతున్నారు. ప్ర‌పంచ వ్యాప్తంగా డిప్రెష‌న్‌తో బాధ‌ప‌డుతున్న వారి సంఖ్య 264 మిలియ‌న్లు ఉంటుంద‌ని గ‌ణాంకాలు చెబుతున్నాయి. డిప్రెష‌న్ బారిన ప‌డిన వారికి ప‌లు ర‌కాలుగా వైద్యులు చికిత్స‌ను అందిస్తారు. బిహేవియ‌ర‌ల్ యాక్టివేష‌న్, కాగ్నిటివ్ బిహేవియ‌ర‌ల్ థెర‌పీ (సీబీటీ), ఇంట‌ర్‌ప‌ర్స‌న‌ల్ సైకోథెర‌పీ (ఐపీటీ) వంటి థెర‌పీల‌తోపాటు యాంటీ డిప్రెస్సెంట్ మందుల‌ను కూడా ఇస్తారు. అయితే డిప్రెష‌న్‌కు డిజిట‌ల్ ట్రీట్‌మెంట్ కూడా ఉంది.

Depression: play games daily to over come it

డిజిట‌ల్ ట్రీట్‌మెంట్ అంటే.. గేమ్స్ ఆడ‌డం. వ‌ర్చువ‌ల్ రియాలిటీ సాఫ్ట్‌వేర్ లేదా సాధార‌ణ గేమ్స్ ఆడ‌డం. డిప్రెష‌న్‌కు దీన్ని ప్ర‌త్యామ్నాయ చికిత్స‌గా వైద్య నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల డిప్రెష‌న్ తోపాటు ఇత‌ర మాన‌సిక అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు చికిత్స అవుతుంద‌ని అంటున్నారు. ద‌క్షిణ కొరియాలో ఇదే విష‌యంపై ఇప్ప‌టికే ప‌రిశోధ‌న‌లు చేస్తున్నారు. డిజిటల్ ట్రీట్‌మెంట్ కోసం అక్క‌డ 26.2 మిలియ‌న్ డాల‌ర్ల‌ను వెచ్చిస్తున్నారు. ముఖ్యంగా డిజిట‌ల్ ట్రీట్‌మెంట్‌ను డిప్రెష‌న్ బాధితుల‌కు ఇవ్వ‌నున్నారు.

కోవిడ్ నేప‌థ్యంలో అనేక కార‌ణాల వ‌ల్ల ఇప్ప‌టికే కొన్ని కోట్ల మంది డిప్రెష‌న్ బారిన ప‌డ్డార‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. కోవిడ్ మ‌న మాన‌సిక ఆరోగ్యంపై తీవ్ర ప్ర‌భావం చూపిస్తుంద‌ని నిపుణులు సైతం అభిప్రాయాల‌ను వ్య‌క్తం చేస్తున్నారు. కోవిడ్ వ‌ల్ల డిప్రెష‌న్, ఆందోళ‌న కేసుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది.

అయితే డిప్రెష‌న్ బారిన ప‌డిన వారు రోజూ కొన్ని గంట‌ల పాటు వీడియో గేమ్స్ ఆడ‌డం వ‌ల్ల డిజిట‌ల్ ప‌ద్ధ‌తిలో ట్రీట్‌మెంట్ తీసుకున్న‌ట్లు అవుతుంద‌ని, దీంతో మాన‌సిక ప్రశాంత‌త ల‌భిస్తుంద‌ని అంటున్నారు. అందువ‌ల్లే డిజిట‌ల్ ట్రీట్‌మెంట్‌కు ఆద‌ర‌ణ పెరుగుతోంది. దీని వ‌ల్ల డిప్రెష‌న్‌, ఒత్తిడి, ఆందోళ‌నల‌ను చాలా వ‌ర‌కు త‌గ్గించుకోవ‌చ్చ‌ని అంటున్నారు.

Share
Admin

Recent Posts