భారత దేశంలో డయాబెటీస్ వ్యాధి బాగా ప్రబలిపోతోంది. దీనికి కారణం జీవన విధానాలలో మార్పు రావటమేనంటున్నారు వైద్య నిపుణులు. భారతీయులు కొత్త జీవన విధానంలో గతంలో కంటే కూడా ఆహారాలు అధికంగా తింటున్నట్లు, కాని దానికి తగ్గ శారీరక శ్రమ చేయటంలో అశ్రధ్ద కనపరుస్తున్నట్లు అమెరికన్ డయాబెటీస్ అసోసియేషన్ ఒక నివేదికలో పేర్కొంది. ప్రజలు 40 సంవత్సరాల వయసు దాటిందంటే ప్రతి సంవత్సరం షుగర్ వ్యాధి పరీక్షలు చేయించాలని సూచిస్తున్నారు.
అయితే, అధిక బరువు, కుటుంబంలో ఇతరులకు డయాబెటీస్ లేదా రక్తపోటు వున్నట్లయితే లేదా నడుము చుట్టూ కొవ్వు పేరుకున్నట్లయితే, జీవన విధాన వ్యాధులకు ఈ పరిస్ధితులు ప్రోత్సహిస్తాయని కనుక ఇటువంటి వ్యక్తులు ఇంకనూ మరింత తక్కువ వయసులోనే పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం వున్నట్లు తెలిపారు.
ప్రస్తుత డయాబెటీస్ వ్యాధి వ్యాపించే తీరు పరిశీలిస్తే, త్వరలో ఇది దేశమంతా అధిక స్ధాయిలో వుండగలదని, దీనికి కారణం నేటి సుఖవంత జీవనశైలి విధానాలకై ఆధునికంగా వస్తున్న పరికరాలే కారణమని నివేదిక తెలుపుతోంది. అధిక బరువుతో మొదలయ్యే సమస్యలు డయాబెటీస్ ద్వారా గుండె, నరాల వ్యవస్ధ, కిడ్నీలు మొదలైన వాటికి కారణంగా వుంటున్నాయని. ఈ జబ్బులకు ప్రజలు అధికంగా వ్యయం చేయవలసి వస్తోందని వైద్య నిపుణులు తెలుపుతున్నారు.