రోజూ వాకింగ్ చేయడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయన్న సంగతి తెలిసిందే. వాకింగ్ చేయడం వల్ల అధిక బరువు తగ్గుతారు. డయాబెటిస్ ఉన్నవారికి షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇంకా ఇతర లాభాలు కలుగుతాయి. అయితే ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ ఎంత సేపు వాకింగ్ చేయాలనే ప్రశ్న చాలా మందికి తలెత్తుతుంది. మరి దీనికి నిపుణులు ఏమని సమాధానం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
వారానికి కనీసం 150 నిమిషాల వ్యాయామం అయినా అవసరం అని వైద్యులు చెబుతుంటారు. అంటే వారంలో 5 రోజులు వ్యాయామం చేసినా రోజుకు 30 నిమిషాల చొప్పున 150 నిమిషాలు అవుతాయి. అంటే ఆరోగ్యంగా ఉండేందుకు కనీసం వ్యాయామం చేయాల్సిన సమయం ఇదన్నమాట. ఇక గరిష్టంగా ఎంత అంటే.. 10వేల అడుగులు.. అవును.. రోజూ గరిష్టంగా 10వేల అడుగులు నడిస్తే.. గరిష్టంగా వ్యాయామం చేసినట్లు అవుతుంది.
అయితే 10వేల అడుగులు అంటే ఎన్ని నిమిషాల పాటు నడవాలి.. అంటే.. ఒక గంట సేపు ఒక మోస్తరు వేగంతో నడిస్తే మనం సుమారుగా 7200 అడుగులు నడుస్తాం. దీన్ని సైంటిస్టుల ప్రయోగాత్మకంగా నిరూపించారు. ఈ లెక్కన చూస్తే.. 10వేల అడుగులు నడిచేందుకు మనకు సుమారుగా 1 గంట 23 నిమిషాల సమయం పడుతుంది. అందువల్ల రోజూ 1 గంట 23 నిమిషాల పాటు నడిస్తే 10వేల అడుగుల దూరాన్ని పూర్తి చేయవచ్చు. ఇది గరిష్టంగా మనం రోజుకు చేసే వ్యాయామం అన్నమాట.
అందువల్ల రోజూ 10వేల అడుగుల దూరం నడిస్తే చక్కని వ్యాయామం అవుతుందని సైంటిస్టులు చెబుతున్నారు. అయితే రోజుకు 4,400 అడుగుల దూరం నడిస్తే చాలని హార్వార్డ్ మెడికల్ స్కూల్ పరిశోధకులు చెబుతున్నారు. కనుక ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ ఎన్ని అడుగుల దూరం నడవాలో మీకు మీరే నిర్ణయించుకోండి. ఆ ప్రకారం నడవండి. ఆరోగ్యంగా ఉండండి..!
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365