భవిష్యత్తులో చేతికు పచ్చబొట్లుగా QR కోడ్ లు పెట్టుకోవచ్చు! వేలి ముద్దర్లు, కంటి రెటీనా స్కాన్ లూ, Face recognition ల సహాయంతో మనం ఉత్తినే మార్కెట్ కి వెళ్ళి గడప ఈవలికి రాగానే పేమెంట్ ఆటోమేటిగ్గా అయిపోవచ్చు! Wearable credit card లు, Credit card Band లు రావచ్చు! భవిష్యత్తులో రక్షాబంధన్ కి అన్నయ్యే ఓ పదివేల రూపాయల Gift Voucher కలిగిన రాఖీని చెల్లి చేతికి Gift గా కట్టవచ్చు! ఏమో! మన వేలి ముద్రే QR కోడ్ గా మారిపోవచ్చు! Finger print స్థానే నాలుక Print స్కానర్లు షుగర్ కోటింగ్ తో రావచ్చు! (మనిషికి Finger print లాగానే నాలుక ప్రింట్ లు కూడా వేరు వేరుగా వుంటాయి)
ముందు ముందు మనుష్యులు గ్రహాంతరవాసుల్లాగా బుఱ్ఱలో GPSలు అమర్చుకోనూవచ్చు , తల్లోంచి యాంటెన్నాలు మొలవానూ వచ్చు! అప్పుడు మనం ఎక్కడికెళితే అక్కడ GPS ను బట్టీ park లూ, సినిమాలూ, టోల్ కూ టిక్కెట్లు, బస్సు, మెట్రో, ఫ్లైట్ టిక్కెట్లకు రుసుము ఆటోమేటిగ్గాdeduct అయిపోనూ వచ్చు! ఏమో, ముందు ముందు ప్రయాణాలు చేయటానికి అవసరమే వుండకపోవచ్చు! భవిష్యత్తులో జనాలెక్కువైపోయి వుండటానికి రోడ్లు, గల్లీలు చాలకపోవచ్చు, అందరూ ఇళ్ళల్లోంచే పనులు చేసుకోనూ వచ్చు! భవిష్యత్తులో ఊపిరిపీల్చుకుంటున్నందుకు కూడా నెలనెలా బిల్లు రావచ్చు.
మన బ్యాంకుల్లో బ్యాలెన్సు Nill అయిపోతే పెనాల్టీ క్రింద ఒక్కో పన్నూ దానంతట అదే ఊడిపోవచ్చు! అప్పుడు సైబర్ నేరగాళ్ళ స్థానే అవయవాల దొంగలు వేళ్ళ ముద్దర్లూ, కంటి రెటీనాలూ, బుఱ్ఱలోని GPS యాంటెన్నాలూ దొంగతనం చేసేవాళ్ళు బయల్దేవరచ్చు! ఇప్పటి మన తరానికి మనకి డబ్బు అంటే నిజమైన రూపాయి కాగితమనీ, మిగతా నోట్లన్నీ ఆ రూపాయిని మారకానికి RBI గవర్నర్ రాసిచ్చే హామీ పత్రమని తెలియనే తెలియదు. వెరసి రూపాయి అంటే ఏంటో కూడా తెలియని తరం ముందు ముందొకటి బయల్దేరవచ్చు! ముందు ముందు కిడ్నాపర్లు Ransom గా క్రిప్టో కరన్సీని అడగవచ్చు!