వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు సామాన్యం. కాని, వాటిని ఆలా వదిలేయకుండా సరిచేసుకున్నప్పుడే సంబంధబాంధవ్యాలు సరవుతాయి. అహాన్ని పక్కనపెట్టి సంబంధాన్ని మెరుగుపరచుకోవాలనికృషిచేస్తే తప్పకుండా ఫలితం ఉంటుంది. అయితే వైవాహిక జీవితంలో సమస్యలను తగ్గించడానికి కొన్ని ఫెంగ్ షుయ్ చిట్కాలు ఉన్నాయి. ఫెంగ్ షుయ్ ప్రకారం పడక గదిలోని వాతావరణం ఇంకా మంచం యొక్క స్థానం బట్టి కూడా వైవాహిక జీవితం ఆధారపడి ఉంటుందని నమ్ముతారు. వైవాహిక జీవితంలో ఉండే ఒడిదుడుకులు అధిగమించడానికి కొన్ని చిట్కాలు ఇవే.. ఫెంగ్ షుయ్ ప్రకారం మీ పడక గది సరైన స్థానంలో ఉండాలి. ఒకవేళ అలా లేదంటే పడక గదిలో అద్దాలను హ్యాంగ్ చెయ్యాలి అని సూచిస్తున్నారు. అంతే కాదు గది బయట క్రిస్టల్స్ హ్యాంగ్ చేసిన మంచి ఫలితం ఉంటుంది.
పరుపు పై పరిచే దుప్పట్లు కూడా వైవాహిక జీవితం ఆధారపడుతుందని ఫెంగ్ షుయ్ చెబుతుంది. తెలుపు లేదా ప్రకాశవంతమైన ఆకుపచ్చ ప్రేమ యొక్క రంగుగా గుర్తిస్తారు. అంతే కాదు ఎరుపు రంగు దుప్పటి వాడిన కూడా ఫలితం కనబడుతుందట. మంచం కిటికీలకు ఉన్న దిక్కున వెయ్యకూడదు, ఒకవేళ అలా కుదరకపోతే కిటికీలకు మరియు మంచానికి తగినంత దూరం ఉండాలని ఫెంగ్ షుయ్ చెబుతుంది. కుదిరినంత వరకు మంచం క్రింద ఎలాంటి వస్తువులు పెట్టకపోవడమే మంచిది. అలా వస్తువులు పెట్టడం వల్ల జంట మధ్య గొడవలు జరిగే ఆస్కారం ఉంది.
పడక గదిలో టీవీ లేదా కంప్యూటర్ వంటివి లేకపోవడమే మంచిది, వీటితో నెగటివ్ ఎనర్జీ వస్తుందని ఫెంగ్ షుయ్ నమ్ముతుంది. ఒక వేళా ఉన్న కూడా వాటికి క్యాబినెట్ వంటివి ఉండాలి. పడక గది గోడలకు లేత రంగులు వెయ్యడం మంచిది. నలుపు లేదా ఎరుపు రంగులు ఎట్టి పరిస్థితుల్లో వెయ్యకూడదు.