రాత్రి పూట ఎవరైనా చాలా పద్ధతిగా, నీట్‌గా బెడ్ సర్దుకుని బెట్ షీట్లు కప్పుకుని నిద్రిస్తారు. నిద్రించినప్పుడు బెడ్ కూడా బాగా నీట్‌గా ఉంటుంది. కానీ తెల్లారి లేచి చూసే సరికి బెడ్ చిందర వందర అయి ఉంటుంది. బెడ్ షీట్స్ అసలు బెడ్‌పై ఉండవు. అటో, ఇటో ఎటో ఒక పక్కకు పడిపోతాయి. ఇక బెడ్‌పై పడుకునే వారు అయితే రక రకాల భంగిమల్లో తిరిగి ఉంటారు. కొందరైతే పూర్తిగా రివర్స్ అవుతారు. అంటే.. నిద్రించినప్పుడు ఒక వైపుకు ఉంటే తెల్లారి లేచినప్పుడు మరో వైపుకు ఉంటారు. కానీ అలా తిరిగినట్టు వారికి కూడా తెలియదు. కేవలం కొందరు మాత్రమే ఇలా బెడ్‌కు అడ్డంగా తిరిగి పడుకుంటారు. అయితే ఇలా వారు ఎందుకు చేస్తారో తెలుసా..? అందుకు కారణాలున్నాయి. అవేమిటంటే…
నిద్రించేటప్పుడు మన శరీరం మెదడుకు ఈఈజీ అనబడే సిగ్నల్స్‌ను పంపుతుందట. దీంతో మెదడు స్పందించి శరీరంలోని అవయవాలను కదిలేలా చేస్తుందట. దీంతో శరీరానికి శక్తి సరిగ్గా అందుతుంది. అయితే అలా కదిలే విషయం మనకు కూడా సరిగ్గా తెలియదు. ఈ క్రమంలో ఆ కదలికలు మరీ ఎక్కువగా ఉంటే అలాంటి వారు బెడ్‌పై బాగా తిరుగుతారు. కొందరైతే కదలికలు ఇంకా ఎక్కువగా ఉంటే బెడ్‌కు అడ్డంగా తిరుగుతారు. ఇదీ.. దీని వెనుక ఉన్న కారణం.
అయితే ఎవరైనా ఇలా బెడ్‌పై నిద్రలో అడ్డంగా తిరగడం వెనుక పలు ఇతర కారణాలు కూడా ఉన్నాయి. అవేమిటంటే… దంతాలు, చిగుళ్ల సమస్య ఉన్న వారు రాత్రి పూట పళ్లు కొరుకుతూ ఎక్కువగా అలా తిరుగుతారట. ఇక రాత్రి పూట కొందరికి శ్వాస సరిగ్గా ఆడదట. అందుకని వారు అటు, ఇటు బెడ్‌పై తిరుగుతారట. ఇక స్ట్రెస్, కంగారు, మానసిక ఆందోళన వంటి సమస్యలు ఉన్నవారు కూడా ఇలా బెడ్‌పై రాత్రి పూట అడ్డంగా తిరుగుతారట. కొందరికైతే కాలి పిక్కలు పట్టుకుపోవడం వంటి సమస్యలు ఉంటాయి. అలాంటి వారు కూడా బెడ్‌పై అడ్డంగా తిరిగేందుకు చాన్స్ ఉంటుందట. దీంతోపాటు రాత్రి పూట సడెన్‌గా నిద్రలో ఉలిక్కిపడి లేచే వారు కూడా ఇలా బెడ్‌పై అడ్డ దిడ్డంగా నిద్రిస్తారట. అయితే ఈ స్థితిని తగ్గించుకునేందుకు పలు సూచనలు కూడా అందుబాటులో ఉన్నాయి. వాటిని పాటిస్తే బెడ్‌పై అడ్డ దిడ్డంగా తిరగడం తక్కువవుతుంది. ఆ సూచనలు ఏమిటంటే…
వ్యాయామం, యోగా వంటివి చేస్తే చక్కగా నిద్రపడుతుంది. అప్పుడు బెడ్‌పై అడ్డ దిడ్డంగా తిరిగే అలవాటు కూడా పోతుంది. లేదంటే రోజూ రాత్రి నిద్రించేముందు ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలు తాగినా చాలు, నిద్రించే విధానం మారుతుంది. చక్కగా నిద్ర పడుతుంది. దీంతోపాటు రాత్రి పూట నిద్రించడానికి ముందు గోరువెచ్చని నీటితో స్నానం చేసినా చాలు సమస్య నుంచి బయట పడవచ్చు. నిద్రించడానికి ముందు మొబైల్ ఫోన్స్ వాడడం పూర్తిగా మానేయాలి. ఈ సూచనలు పాటిస్తే బెడ్‌పై అడ్డ దిడ్డంగా నిద్రించే అలవాటు పోతుంది..!