భారతీయ సంస్కృతిలో, హిందూ ధర్మంలో వేదాలకు, వేద మంత్రాలకు ఉన్న శక్తి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గాయత్రి మంత్రం, భగవద్గీత, శ్లోకాలు, శ్రీకృష్ణ దామోదరాష్టకం వంటివి మానసిక ఆరోగ్యానికి దోహదపడతాయని పరిశోధనల్లో తేలింది. మంత్రాల శబ్దానికి మానసిక ప్రశాంతత కలుగుతుందని అంటారు. ఇటీవలి కాలంలో చాలా మంది కూడా తమ పిల్లలకి వీటిపై అవగాహన పెంచుతున్నారు. చిన్న చిన్న వయస్సులోనే శ్లోకాలు నేర్పిస్తున్నారు. వారుముద్దు ముద్దుగా చెబుతుంటే అవి చూసిన ప్రతి ఒక్కరు మంత్రముగ్ధులు అవుతున్నారు.
తాజాగా చిన్నారికి సంబంధించిన పాత వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. సుమారు ఎనిమిది నెలల వయసున్న ఆ పాప, శ్రీ కృష్ణ దామోదరాష్టకానికి సంబంధించిన కీర్తనని ముద్దు ముద్దుగా పలకడంతో వీడియో వైరల్ అవుతుంది. రెండేళ్ల క్రితం వీడియో ఇది కాగా, ఇప్పుడు ఇది అందరిని ఆకట్టుకుంటుంది. శిశువు పద్యాల్లోని ప్రతి పదాన్ని అందమైన స్పర్శతో ఉచ్చరించడాన్ని మనం వినవచ్చు. శ్రీ దామోదరాష్టకం అనేది శ్రీకృష్ణుని దామోదరగా భావించే ప్రసిద్ధ భజన. ఈ ప్రార్థన గొప్ప ఋషి సత్యవ్రతచే స్వరపరచబడిందని చెప్పబడింది. చిన్నారి ఎంతో అందంగా చెప్పే ఈ వీడియో మీలోని ఆధ్యాత్మికతను తప్పకుండా మేల్కొల్పుతుంది.
సోషల్ మీడియాలో ఇటీవలే పిల్లలకు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారుతున్నాయి. వారు చిలిపి చిలిపిగా చేసే చేష్టలు అందరిని నవ్వేలా చేస్తున్నాయి. అంతేకాకుండా ఇలాంటి వీడియోలు చూసేందుకు కూడా సోషల్ మీడియా వినియోగదారులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఇటీవల ఓ మూడు సంవత్సరాలు కలిగిన పాప శివతాండవ స్తోత్రాన్ని పటించింది. దాదాపు ఈ వయస్సు గల వారు సంస్కృత శ్లోకాలను పాటించడం చాలా కష్టం. ఎందుకంటే మూడు సంవత్సరాల గల పిల్లలకి మాటలు అప్పుడప్పుడే వస్తూ ఉంటాయి. ఈ క్రమంలో ఆ బుజ్జి పాపాయి ఎంతో కఠినమైన సంస్కృత శ్లోకాలను చదివిందంటే చాలా గొప్ప అని అంటున్నారు.
महाभारत में अभिमन्यु ने चक्रव्यूह तोड़ने की कला अपने मां के पेट में सीखी थी।
इस बात पर शायद आपको विश्वास नही होता है ना!
तो यह वीडियो देखिए 8 महीने के बच्चे का।अद्भुत अलौकिक सनातन संस्कृति???? pic.twitter.com/wzGZPqbEr6
— Vaidik Gyaan (@VaidikGyaan) October 2, 2024