సోషల్ మీడియాలో వినోదానికి సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. వాటిలో యువతులు చేసే విచిత్రమైన పనులకు సంబంధించిన వీడియోలైతే ఇక చెప్పాల్సిన అవరసం లేదు. ఇలా షేర్ చేయగానే.. అలా వైరల్ అయిపోతుంటాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని చాలా మంది యువతులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు వివిధ రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. అందమైన అమ్మాయి బైకు ఆపడంతో యువకుడు సంబరపడ్డాడు. అయితే చివరకు ఆమె ఇచ్చిన ట్విస్ట్ తెలుసుకుని అవాక్కయ్యాడు. సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ అందమైన యువతి రోడ్డు పక్కన నిలబడి.. ఎవరైనా లిఫ్ట్ ఇస్తారేమో అని ఎదురుచూస్తుంటుంది.
ఇంతలో ఎదురుగా బైకు రావడం చూసి చేయి ఎత్తి లిఫ్ట్ అడుగుతుంది. అందమైన అమ్మాయి బైకు ఆపడం చూసి సదరు యువకుడు సంబరపడిపోయి బండిని ఆపుతాడు. అయితే ఇక్కడే ఆమె అతడికి పెద్ద ట్విస్ట్ ఇచ్చింది. బైకు వెనుక ఆమె కూర్చోకుండా.. ఓ వృద్ధుడిని పిలిచి కూర్చోబెడుతుంది. అయితే ఇదంతా గమనించిన ఆ యువకుడు.. ఆమ్మాయే బైకుపై కర్చుందనే ఆనందంతో సంబరంగా డ్రైవ్ చేస్తుంటాడు. మధ్య మధ్యలో సడన్ బ్రేకులు వేస్తూ ఎంజాయ్ చేస్తుంటాడు. అయితే కాస్త దూరం వెళ్లిపోయాక.. అనుమానం వచ్చి బైకును ఆపి వెనక్కు చూస్తాడు. వెనుక వైపు అమ్మాయి బదులుగా తాతయ్య ఉండడం చూసి ఖంగుతింటాడు.
ఇలా ఆ యువతి అతడికి వినూత్నంగా షాక్ ఇచ్చింది. ఇదంతా వ్యూస్, లైకుల కోసం కావాలని చేసినా.. వీడియో మాత్రం తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఈ యువతి భలే షాక్ ఇచ్చిందిగా.. అంటూ కొందరు, పాపం అమ్మాయే అనుకుని ఊహల్లో తేలిపోయాడు.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో వేలకు పైగా లైక్‌లు, లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ये तो धोखा हो गया 😷
🤣🤣🤣🤣🤣 pic.twitter.com/jmpyr7CWBY— मनप्रीत कौर❤मन💕 (@mannkaurr1) October 11, 2024