Yoga Asanas For Weight Loss : యోగాసనాలు వేయడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందన్న సంగతి మనకు తెలిసిందే. అలాగే మనం ప్రతి సంవత్సరం జూన్ 21న యోగా దినోత్సవాన్ని కూడా జరుపుకుంటూ ఉంటాము. యోగా చేయడం వల్ల మన మనసును మరియు ఆరోగ్యం కూడా చక్కగా ఉంటాయి. రోజూ యోగా చేయడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి. మొదటిసారి యోగాసనాలు చేసేవారు, ప్రతిరోజూ యోగా చేయాలనుకునే వారు ముఖ్యంగా ఈ మూడు ఆసనాలను వేయడం వల్ల చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. ఈ యోగాసనాలల్లో తడాసనం కూడా ఒకటి. ఆ ఆసనం వేయడం వల్ల శరీరం ధృడంగా మారుతుంది. ఊపిరితిత్తుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఒత్తిడి, ఆందోళన వంటివి దూరమవుతాయి. శరీర బరువు తగ్గుతుంది.
వెన్నునొప్పి, సయాటికా వంటి నొప్పులు తగ్గుతాయి. ఎత్తు పెరగడానికి కూడా ఈ ఆసనం మనకు దోహదపడుతుంది. తడాసనం వేయడం చాలా సులభం. ఈ ఆసనం వేయడానికి ముందుగా నిటారుగా నిలబడాలి. తరువాత కాళ్లను కొద్దిగా దూరం పెట్టి చేతులను, తలను పైకెత్తి నిలబడాలి. తరువాత శ్వాస తీసుకుంటూ చేతులతో మడమలను పైకెత్తాలి. అలాగే మన శ్వాసపై ధ్యాసను ఉంచాలి. ఇలా తడాసనం వేయడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చు. ఇక రెండవది త్రిక తడాసనం. ఈ ఆసనం వేయడం వల్ల భుజాలు, వెన్నుముక బలంగా తయారవుతుంది. శరీరంలో బాగా వంగుతుంది.
మలబద్దకం సమస్యతో బాధపడే వారు ఈ ఆసనం వేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగే శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఆ ఆసనం వేయడానికి ముందుగా నిటారుగా నిలబడాలి. తరువాత కాళ్లను దూరం జరిపి చేతులను పైకెత్తి త్రిభుజంతా నిలబడాలి. తరువాత శరీరాన్ని ఒకసారి కుడి వైపుకు, మరోసారి ఎడమవైపుకు వంచాలి. అలాగే శ్వాస మీద ధ్యాస ఉంచడం మంచిది. ఇక మూడవ ఆసనం కడిచక్రాసనం. ఈ ఆసనం వేయడం వల్ల నడుము చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది. మలబద్దకంసమస్య తగ్గుతుంది. శరీరం ప్లేక్ల్సిబుల్ గా తయారవుతుంది. మలబద్దకం సమస్య తగ్గుతుంది.
భుజం, మెడ, పొత్తి కడుపు, వెన్నుపాము బలంగా తయారవుతుంది. ఈ ఆసనం వేయడానికి ముందుగా నిటారుగా నిలబడాలి. తరువాత కుడి చేతిని ఎడమ భుజంపై ఉంచాలి. తరువాత ఎడమచేతిని వెనక్కి మలిచి కుడికాలు తుంటి భాగంపై ఉంచి ఎడమవైపు తిరగాలి. మరలా నిటారుగా నిలబడి చేతుల స్థితిని మార్చి మరలా కుడివైపుకు తిరగాలి. ఈ విధంగా రోజూ ఈ మూడు ఆసనాలను వేయడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.