Samantha : సోషల్ మీడియాలో సమంత ఈ మధ్యకాలంలో ఎక్కువ యాక్టివ్‌గా ఉంటోంది. గత కొద్ది రోజులుగా ఆమె సందేశాలను షేర్ చేయడం లేదు. కానీ తాజాగా ఓ సందేశాన్ని షేర్ చేసి మళ్లీ వార్తల్లో నిలిచింది. అప్పట్లో ఆమె నాగచైతన్యతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించాక.. అనేక సార్లు సందేశాలను షేర్ చేసింది. మై మామ్స్ సెయిడ్ పేరిట తన తల్లి చెబుతుందంటూ అనేక కోట్స్‌ను ఆమె షేర్ చేసింది. ఇక తాజాగా మరోమారు ఆమె ఓ సందేశాన్ని షేర్ చేసింది.
గత 30 ఏళ్లుగా అందరిలాగే నేను అనేక ఓటములను, నష్టాలను, వేధింపులను ఎదుర్కొన్నా.. విడాకులు అయ్యాయి, మరణం వరకు వెళ్లా. నా జీవితంలో నేను చాలా భయపడ్డా. నా డబ్బును దోచుకెళ్లారు, నా ప్రైవసీకి భంగం కలిగించారు. నా ఫ్యామిలీతో సంబంధాలు తెగిపోయాయి.. ప్రతి రోజూ అలాగే జరుగుతోంది. అయినా ఇప్పటికే జీవితం ఏంటో అర్థం కావడం లేదు. నా ముందు ఇంకో ఇటుక ఉంది. దాంతో నా జీవితాన్ని మళ్లీ మలచుకోవాలి. అయితే అందుకు నువ్వు సిద్ధమేనా ?.. అని చెబుతూ సమంత ఓ కొటేషన్‌ను షేర్ చేసింది.
అయితే సమంత షేర్ చేసింది ప్రముఖ హాలీవుడ్ నటుడు విల్ స్మిత్‌కు చెందిన ఆటోబయోగ్రఫీ బుక్‌లోని కొన్ని లైన్స్. ఆయన పుస్తకంలోని కొన్ని లైన్స్‌ను సమంత తన సందేశంగా షేర్ చేసింది. అంటే.. సరిగ్గా ఆమె కూడా అదేలాంటి సంఘటనలను, పరిస్థితులను ఎదుర్కొని ఉంటుందని.. అర్థమవుతోంది. ఈ క్రమంలోనే ఆమె షేర్ చేసిన ఈ కొటేషన్ వైరల్ అవుతోంది.