Money : వ్యాపారం చేసేవారు ఎవరైనా సరే అందులో నష్టాలు రావద్దని.. లాభాలు రావాలని.. వ్యాపారం బాగా జరగాలనే కోరుకుంటారు. కానీ కొందరికి మాత్రమే అదృష్టం కలసి వస్తుంది. డబ్బు బాగా సంపాదిస్తారు. ఇక కొందరు వ్యాపారాల్లో తీవ్రంగా నష్టాలను ఎదుర్కొంటుంటారు. ఏం చేసినా అసలు కలసి రాదు. దీంతో తీవ్ర మనస్థాపం చెందుతుంటారు. అయితే కింద తెలిపిన విధంగా వాస్తు సలహాలను పాటించడం వల్ల వ్యాపారం వృద్ధి చెందుతుంది. లాభాలు గడిస్తారు. మరి అందుకు ఏం చేయాలంటే..
వ్యాపారం చేసేవారు తమ వ్యాపార ప్రదేశంలోకి వెళ్లే ముందు చెప్పులను బయటే వదలాలి. ప్రధాన ద్వారంకు బయట కుడి లేదా ఎడమ వైపుకు కొద్ది దూరంలో చెప్పులను వదలాలి. ద్వారం ఎదురుగా చెప్పులను ఎట్టి పరిస్థితిలోనూ విడువకూడదు. అలా చేస్తే అరిష్టం కలుగుతుంది.
ఇక చెప్పులను బయట విడిచిపెట్టాక ముందుగా కుడి కాలును లోపల పెట్టాలి. తరువాతే లోపలికి ప్రవేశించాలి. ఆ తరువాత లక్ష్మీదేవికి పూజ చేసి నేరుగా కూర్చునే చోటుకు వెళ్లాలి.
వ్యాపారం చేసేవారు రోజూ తాము కూర్చునే కుర్చీ స్థానం కూడా సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. ఎల్లప్పుడూ ఉత్తర దిక్కును చూస్తూ ఉండేలా సీట్‌లో కూర్చోవాలి. ఇలా చేస్తే ఉత్తర దిక్కు స్థానం కుబేరుడిది కనుక వ్యాపారంలో లాభాలు బాగా వస్తాయి. డబ్బు బాగా సంపాదిస్తారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా వ్యాపారం కొనసాగుతుంది. ఈ సూచనలు పాటించడం వల్ల వ్యాపార వృద్ధి జరుగుతుంది.