Blood Purification : మన శరీరంలో రక్తం చాలా ముఖ్యపాత్రను పోషిస్తుంది. మనం తినే ఆహారాల్లో ఉండే పోషకాలు, మనం పీల్చే గాలిలో ఉండే ఆక్సిజన్‌ను రక్తం శరీరంలోని భాగాలకు సరఫరా చేస్తుంది. ప్రతి అవయవానికి, కణానికి వాటిని రక్తం అందజేస్తుంది. దీంతో మనం ఆరోగ్యంగా ఉంటాం. అన్ని అవయవాలు సక్రమంగా పనిచేస్తాయి. పోషణ సరిగ్గా అందుతుంది. అయితే మనం పాటించే జీవన విధానంతోపాటు మనం తీసుకునే ఆహారాల వల్ల కూడా రక్తంలో మలినాలు ఏర్పడుతుంటాయి. రక్తంలో వ్యర్థాలు చేరుతుంటాయి. దీంతో మన శరీర భాగాలకు పోషకాలు, ఆక్సిజన్ అందడం సరిగ్గా జరగదు. ఫలితంగా అనారోగ్య సమస్యలు వస్తాయి. అందుకు గాను రక్తాన్ని మనం అప్పుడప్పుడు శుద్ధి చేసుకోవాలి. దీనికి వేప ఆకులు అద్భుతంగా పనిచేస్తాయి.
వేప ఆకుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. ఆయుర్వేద ప్రకారం.. వేపాకులు మనకు అనేక ప్రయోజనాలను అందిస్తాయి. వీటిని పలు మందుల తయారీలోనూ ఉపయోగిస్తారు. వేపాకులతో మనం అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు. అయితే వేపాకులు రక్తాన్ని కూడా శుద్ధి చేయగలవు. అందుకు వేపాకులతో కషాయం తయారు చేసుకుని రోజూ తాగాల్సి ఉంటుంది.
ఒక గ్లాస్ నీటిలో నాలుగైదు వేపాకులను వేసి సన్నని మంటపై 15 నిమిషాల పాటు మరిగించాలి. అనంతరం ఆ నీటిని అలాగే గోరు వెచ్చగా ఉండగానే పరగడుపునే తాగేయాలి. తరువాత 30 నిమిషాల వరకు ఏమీ తీసుకోరాదు. ఇలా క్రమం తప్పకుండా వారం రోజుల పాటు చేస్తే శరీరం అంతర్గతంగా శుభ్రమవుతుంది. వ్యర్థాలు బయటకు పోతాయి. రక్తం శుద్ధి అవుతుంది. దీంతోపాటు చర్మ సమస్యలు కూడా తగ్గుతాయి. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఇలా వేపాకు కషాయాన్ని కనీసం 3-4 నెలలకు ఒకసారి అయినా 7 రోజుల పాటు తీసుకోవాలి. దీంతో రక్తం శుద్ధి అవుతుంది. ఆరోగ్యంగా ఉంటాము.