Cholesterol : మన శరీరంలో రెండు రకాల కొలెస్ట్రాల్స్ ఉంటాయి. ఒకటి చెడు కొలెస్ట్రాల్. దీన్నే ఎల్‌డీఎల్ అంటారు. ఇంకొకటి మంచి కొలెస్ట్రాల్. దీన్ని హెచ్‌డీఎల్ అంటారు. ఎల్‌డీఎల్ మన శరీరానికి చేటు చేస్తుంది. హెచ్‌డీఎల్ మంచి చేస్తుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. కనుక మనం మన శరీరంలో ఎల్‌డీఎల్‌ను తగ్గించుకోవాలి. హెచ్‌డీఎల్‌ను పెంచుకోవాలి. అయితే అందుకు కింద తెలిపిన మూడు రకాల పండ్లు ఎంతో ఉపయోగపడతాయి. వీటిని రోజూ తీసుకుంటే చాలు. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ అన్నది ఉండదు. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీంతో హార్ట్ ఎటాక్‌లు రాకుండా ఉంటాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. మరి చెడు కొలెస్ట్రాల్ తగ్గేందుకు రోజూ తీసుకోవాల్సిన ఆ పండ్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

1. ద్రాక్ష పండ్లలో ఫైబర్, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. కనుక వీటిని రోజుకు ఒక కప్పు మోతాదులో తినాలి. దీంతో చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే లివర్ శుభ్రపడుతుంది. లివర్ ఆరోగ్యంగా పనిచేస్తుంది.
2. పైనాపిల్ పండ్లు కూడా ఎల్‌డీఎల్‌ను తగ్గించి హెచ్‌డీఎల్‌ను పెంచగలవు. వీటిల్లో బ్రొమెలెయిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది అనేక రకాలుగా మనకు ఉపయోగపడుతుంది. రక్తనాళాల్లో పేరుకుపోయిన ఎల్‌డీఎల్‌ను తగ్గిస్తుంది. హెచ్‌డీఎల్‌ను పెంచుతుంది. కనుక చెడు కొలెస్ట్రాల్ తగ్గి గుండె ఆరోగ్యంగా ఉండాలంటే.. రోజూ ఒక కప్పు పైనాపిల్ ముక్కలను తినాలి. లేదా జ్యూస్ అయినా తాగవచ్చు. దీంతో కొలెస్ట్రాల్ లెవల్స్‌ను నియంత్రణలో ఉంచుకోవచ్చు.
3. కొలెస్ట్రాల్ లెవల్స్‌ను నియంత్రించడంలో పొటాషియం కూడా బాగానే పనిచేస్తుంది. ఇది అరటి పండ్లలో అధికంగా లభిస్తుంది. కనుక రోజుకు ఒక అరటి పండును తినాలి. దీంతో కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హైబీపీ నుంచి బయట పడవచ్చు.