Uduga Chettu : వేసవి కాలంలో మాత్రమే లభించే వాటిలో ఊడుగ కాయలు కూడా ఒకటి. ఇవి ఊడుగ చెట్ల నుండి లభిస్తాయి. ఇవి తోటల వెంట, కాలువల వెంట ఎక్కువగా పెరుగుతాయి. ఈ కాయలు పచ్చిగా ఉన్నప్పుడు పచ్చరంగులో, దోరగా ఉన్నప్పుడు ఎరుపు రంగులో, పండిన తరువాత నలుపు రంగులో ఉంటాయి. వీటిని పగలకొట్టి చూస్తే లోపల తెల్ల రంగులో గుజ్జు ఉంటుంది. ఈ కాయలను చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. చిన్న పిల్లలకు ఈ కాయలను ఇవ్వడం వల్ల వారిలో ఎదుగుదల బాగుంటుంది. జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. ఈ చెట్టును సరైన పద్ధతిలో ఉపయోగించడం వల్ల రక్త విరేచనాలు, క్రిమిరోగం, వ్రణాలు, కీళ్ల నొప్పులు, దీర్ఘకాలిక జ్వరాలు, ఉబ్బు రోగం, పాము విషం, పిచ్చి కుక్క విషం, ఎలుక విషం, దీర్ఘరాలిక చర్మ వ్యాధులను ఇలా అనేక రకాల అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు.
పిచ్చి కుక్క కరిచినప్పుడు ఊడుగ చెట్టు వేరును ఆవు పాలతో కలిపి నూరి ఆ మిశ్రమాన్ని 2 గ్రాముల మోతాదులో తీసుకుంటూ ఉంటే పిచ్చి కుక్క విషం హరించుకుపోతుంది. ఎలుకలు కరిచినప్పుడు ఈ మొక్క వేరును గొర్రె మూత్రంతో కలిపి నూరి ఆ మిశ్రమాన్ని ఎలుక కరిచిన చోట ఉంచడం వల్ల ఎలుక విషం హరించుకుపోతుంది. స్త్రీలు కళ్లకు కాటుక పెట్టుకున్నప్పుడు కొన్నిసార్లు కళ్లు దురదలు రావడం, కళ్లు మండడం వంటివి జరుగుతాయి. అలాంటప్పుడు ఊడుగ పువ్వులను సేకరించి వాటిని కంటి రెప్పలపై ఉంచుకోవడం వల్ల కళ్లు దురదలు రావడం, కళ్లు మండడం వంటి సమస్యలు తగ్గుతాయి.
ఆస్తమా వ్యాధిని నివారించే గుణం కూడా ఈ ఊడుగ చెట్టుకు ఉంటుంది. ఈ చెట్టు లేత ఆకులను తీసుకుని పేస్ట్ లా చేసుకోవాలి. దీనికి ఆవు నెయ్యిని కలిపి తీసుకుంటే ఆస్తమా తగ్గుతుంది. ఊడుగ చొట్టు వేరు బెరడును, దోరగా వేయించిన మిరియాలను తీసుకుని మెత్తగా నూరి బఠాణీ గింజల పరిమాణంలో మాత్రలుగా చేసుకుని ఎండబెట్టి నిల్వ చేసుకోవాలి. ఈ మాత్రలను పూటకు ఒకటి చొప్పున రెండు పూటలా తీసుకుంటూ ఉంటే రక్త మొలలు తగ్గుతాయి. వాతపు నొప్పులు ఇబ్బంది పెడుతున్నప్పుడు ఈ ఊడుగ చెట్ల లేత ఆకులను పేస్ట్ గా చేసి ఆ పేస్ట్ ను నొప్పులపై వేసి మర్దనా చేయడం వల్ల వాతపు నొప్పులు తగ్గుతాయి. ఈ చెట్టు వేర్లను ఎండబెట్టి నిల్వ చేసుకోవాలి. పాము కాటుకు లేదా తేలు కాటుకు గురి అయినప్పుడు ఈ వేర్లను రెండు లేదా మూడు చొప్పున నోట్లో వేసుకుని నెమ్మదిగా నములుతూ చప్పరిస్తూ రసాన్ని మింగడం వల్ల పాము కాటుకు ప్రథమ చికిత్సలా పని చేస్తుంది . ఆ తరువాత వైద్యుడి వద్దకు తీసుకెళ్లవచ్చు.
ఊడుగ కాయలను తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఈ పండ్లు ఎంతో రుచిగా ఉంటాయి. అంతేకాకుండా ఈ కాయలు ఎండిన తరువాత వీటి లోపల ఉండే గింజను తినడం వల్ల కూడా మనకు మేలు కలుగుతుంది. ఈ గింజకు తేనెను కలిపి తీసుకుంటూ ఉండడం వల్ల పలు రకాల క్యాన్సర్ ల బారిన పడే అవకాశాలు తక్కువగా ఉంటాయి. వేసవి కాలంలోనే ఈ గింజలు మనకు దొరుకుతాయి. కనుక వీటిని సేకరించి నిల్వ చేసుకుని వాడుకోవచ్చు. ఈ విధంగా ఊడుగ చెట్టును ఉపయోగించి మనకు వచ్చే అనారోగ్య సమస్యల నుండి బయటపడవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.