Hair Cut : మనం నిత్య జీవితంలో చేసే ప్రతి పనికి మన పెద్దలు ఒక విధివిధానాన్ని నిర్దేశించారు. అలాగే క్షవరం కూడా కొన్ని నిర్దేశించిన రోజుల్లో మాత్రమే చేయించుకోవాలి. మన శరీరంలో బయో ఎలక్ట్రిసిటీ అన్ని అవయవాలకు నిరంతరాయంగా ప్రవహిస్తూ ఉంటుంది. అదే విధంగా మన జుట్టులో కూడా విద్యుత్ ఉంటుంది. ఎప్పుడైతే జుట్టును మనశరీరం నుండి వేరు చేస్తామో ఆ సమయంలో మన శరీరం కొంతమేర ప్రాణశక్తిని కోల్పోతుందట. అందుకే పూర్వం మునులు, ఋషులు, యోగులు జుట్టున కత్తిరించుకునే వారు కాదట.
కానీ ప్రస్తుత కాలంలో మనం జుట్టును అలానే ఉంచుకోలేము కనుక మనలోని ప్రాణ శక్తిని చెడు రోజుల్లో బయటకు పంపించకూడదు. కనుక క్షుర కర్మను నిర్దేశించిన రోజుల్లో మాత్రమే చేయించుకోవాలి. క్షవరాన్ని వారంలో సోమ, బుధ, గురు వారాల్లో మాత్రమే చేయించుకోవాలి. మంగళ, శుక్ర, శని వారాల్లో క్షవరాన్ని చేయించకూడదు. ఆదివారం క్షవరాన్ని చేయించుకోవచ్చు కానీ ఆ రోజున చేయించుకుంటే స్వల్ప ఆయుక్షీణం అవుతుందట.
అలాగే గ్రహణం పట్టిన రోజుల్లో, అమావాస్య, పౌర్ణమి రోజుల్లో, ఏకాదశి, ద్వాదశి, చవితి, అష్టమి, నవమి తిథుల్లోనూ క్షవరం చేయించుకోకూడదు. క్షవరం ఎప్పుడూ ఉదయం భోజనానికి ముందే చేయించుకోవాలి. మిట్ట మధ్యాహ్నం, రాత్రి వేళల్లో చేయించుకోకూడదు. పుణ్య క్షేత్రాల్లో గుండు చేయించుకునే వారికి, రోజూ గడ్డం చేసుకుని ఉద్యోగాలకు వెళ్లే వారికి శాస్త్రాల్లో మినహాయింపు ఉంటుంది. అదే విధంగా ఈ నియమాలు గోర్లు తీసుకోవడానికి కూడా వర్తిస్తాయి.