Constipation : మారిన ఆహారపు అలవాట్లు, జీవన శైలి కారణంగా మనం అనేక అనారోగ్యాల బారిన పడుతున్నాం. మనల్ని తరచూ వేధించే అనారోగ్య సమస్యల్లో జీర్ణసంబంధిత సమస్య అయినటువంటి మలబద్దకం కూడా ఒకటి. ప్రస్తుత కాలంలో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఈ సమస్య బారిన పడుతున్నారు. నీరు ఎక్కువగా తాగకపోవడం, పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారాలను తీసుకోకపోవడం, తగినంత శారీరక శ్రమ లేకపోవడం, ప్రేగుల్లో కదలికలు సరిగ్గా లేకపోవడం వంటి వాటిని మలబద్దకం సమస్య రావడానికి కారణాలుగా చెప్పవచ్చు. మలబద్దకం సమస్య కారణంగా గ్యాస్, అసిడిటీ, ఆకలి లేకపోవడం, వికారం, పైల్స్, కడుపులో అసౌకర్యంగా ఉండడం వంటి తదితర సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
కనుక మలబద్దకం సమస్యను ఎట్టి పరిస్థిత్తుల్లో కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ఈ సమస్య బారిన నుండి ఉపశమనాన్ని పొందడానికి చాలా మంది మలబద్దకాన్ని నివారించే సిరప్ లను తాగుతూ ఉంటారు. వీటిని తాగడానికి బదులుగా మనం ఇంటి చిట్కాను ఉపయోగించి చాలా సులభంగా ఈ సమస్యను నుండి బయటపడవచ్చు. ఈ చిట్కాను పాటించడం వల్ల సుఖ విరేచనం అవ్వడంతోపాటు ప్రేగులన్నీ కూడా కడిగినట్టు శుభ్రపడతాయి. మలబద్దకాన్ని నివారించే ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గాను ముందుగా ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిని తీసుకోవాలి. తరువాత ఈ నీటిలో ఒక టీ స్పూన్ ఆముదాన్ని వేసి కలపాలి. స్వచ్ఛమైన ఆముదాన్ని వాడడం వల్ల ఫలితం అధికంగా ఉంటుంది. తరువాత ఈ నీటిలో అర టీ స్పూన్ ఉప్పును, అర చెక్క నిమ్మరసాన్ని వేసి కలపాలి.
ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని తీసుకోవడానికి పావు గంట ముందు ఒక గ్లాస్ నీటిని తాగాలి. తరువాత ఆముదం కలిపిన నీటిని తాగాలి. ఇలా ఆముదం కలిపిన నీటిని తాగిన అర గంట తరువాత మరో గ్లాస్ నీటిని తాగాలి. ఇలా నీటిని తాగడం వల్ల ఫలితం అధికంగా ఉంటుంది. ఇలా తయారు చేసుకున్న నీటిని ఎప్పుడైనా తాగవచ్చు. ఈ నీటిని తాగిన 15నిమిషాల్లోనే సుఖ విరేచనం అయ్యి మలబద్దకం సమస్య తగ్గుతుంది. చిన్న పిల్లలకు కూడా ఈ నీటిని ఇదే విధంగా ఇవ్వాలి. కానీ చిన్న పిల్లలకు ఇచ్చే నీటిలో అర టీ స్పూన్ ఆముదాన్ని మాత్రమే కలపాలి. ఈ విధంగా ఈ చిట్కాను వారానికి ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే పాటించాలి. మలబద్దకం సమస్యతో బాధపడే వారు ఇలా ఈ చిట్కాను వాడి నిమిషాల వ్యవధిలోనే సమస్య నుండి ఉపశమనాన్ని పొందవచ్చు.