Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home food

Dal Tadka : ధాబా స్టైల్‌లో ఎంతో రుచిక‌ర‌మైన ప‌ప్పు.. త‌యారీ ఇలా..

Editor by Editor
September 19, 2022
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Dal Tadka : ప‌ప్పు అన‌గానే చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు. మ‌నం అనేక ర‌కాల కూర‌గాయ‌ల‌ను ప‌ప్పులో వేసుకుని వండి తింటుంటాం. ఏ పప్పు అయినా స‌రే రుచిగా ఉంటుంది. అయితే కాస్త వెరైటీగా ధాబా స్టైల్‌లోనూ ప‌ప్పును చేసుకుని తిన‌వ‌చ్చు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. కాస్త శ్ర‌మించాలే కానీ దీన్ని త‌యారు చేయ‌డం కూడా సుల‌భ‌మే. ధాబా స్టైల్‌లో ఎంతో రుచిక‌ర‌మైన దాల్ త‌డ్కాను ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Dal Tadka make it in dhaba style very easy method
Dal Tadka

దాల్ త‌డ్కా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

కందిపప్పు- 1/2 కప్పు, పెసరపప్పు- 1/2 కప్పు, శనగపప్పు- 1/4 కప్పు, మైసూర్ పప్పు – 1/4 కప్పు, చిన్న ఉల్లిపాయ – 1, చిన్న టమాటా – 1, పచ్చిమిర‌పకాయ‌లు – 2, అల్లం – చిన్నముక్క, ధనియాలపొడి – 1/4 టీ స్పూన్, గరం మసాలా- 1/4 టీ స్పూన్, ఉప్పు- 1/2 టీ స్పూన్, పసుపు- 1/4 టీ స్పూన్, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ- 1/2 టీ స్పూన్, కసూరి మేథీ – 1/4 టీ స్పూన్, కరివేపాకు, కొత్తిమీర – 1/4 కప్పు, చింతపండు రసం – 2 టీ స్పూన్లు.

దాల్ త‌డ్కాను త‌యారు చేసే విధానం..

పైన చెప్పిన ప‌ప్పుల‌న్నింటినీ క‌లిపి కుక్క‌ర్‌లో మెత్త‌గా ఉడికించుకోవాలి. బాణ‌లి తీసుకుని అందులో నెయ్యి వేసి వేడెక్కాక‌.. జీల‌క‌ర్ర‌, ఆవాలు, ఎండు మిర‌ప‌కాయ‌లు, ఇంగువ వేసి పోపు వేయించుకోవాలి. అనంత‌రం అందులో క‌ట్ చేసిన ఉల్లిపాయ‌, ప‌చ్చి మిర‌ప‌కాయ‌లు, ట‌మాటాల‌ను వేసి బాగా వేయించుకోవాలి. అనంత‌రం అందులో ఉప్పు, ప‌సుపు కూడా వేసి బాగా క‌ల‌పాలి. త‌రువాత మెత్త‌గా ఉడికిన ప‌ప్పు మిశ్ర‌మాన్ని మ‌రింత మెత్త‌గా చేసి పోపులో వేయాలి. ఆ త‌రువాత ధ‌నియాల పొడి, గ‌రం మ‌సాలా, క‌సూరీ మేథీ వేసుకోవాలి. అవ‌సరం అనుకుంటే అందులో చింత పండు ర‌సం కూడా క‌లుపుకోవ‌చ్చు. ఆ త‌రువాత ప‌ప్పును బాగా క‌లిపి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అనంత‌రం దానిపై కొత్తిమీర వేసి దింపాలి. అంతే.. ఘుమ ఘుమ‌లాడే దాల్ త‌డ్కా త‌యార‌వుతుంది. దీన్ని చ‌పాతీలు లేదా అన్నంతో తిన‌వ‌చ్చు. ఎంతో రుచిగా ఉంటుంది.

Tags: Dal Tadka
Previous Post

Shiny Hair : జుట్టు కాంతివంతంగా మారి ప‌ట్టులా మెర‌వాలంటే.. అద్భుత‌మైన చిట్కాలు..

Next Post

Dates : ఎండు ఖ‌ర్జూరాల‌ను తేనెలో నాన‌బెట్టి తింటే.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Related Posts

హెల్త్ టిప్స్

ఈ ఆహారాల‌ను రోజూ తింటే చాలు.. మీ ర‌క్తం శుభ్రంగా మారుతుంది..!

July 5, 2025
వ్యాయామం

మీ ఇంట్లోనే ఈ వ్యాయామాల‌ను చేయండి.. పైసా ఖ‌ర్చు లేకుండా బ‌రువు త‌గ్గుతారు..!

July 5, 2025
ప్ర‌శ్న - స‌మాధానం

4 ఏళ్ల నుంచి షుగ‌ర్‌కు మందులు వాడుతున్నా.. ఆయుర్వేద మందులతో త‌గ్గుతుందా..?

July 5, 2025
వినోదం

కేవ‌లం క‌న్య‌ల‌కు మాత్ర‌మే ప్ర‌వేశం ఉన్న ఆల‌యం అది.. ఆ ఊర్లో ఉంది.. త‌రువాత ఏమైంది..?

July 5, 2025
viral news

అంతర్వేదిలో స్నానానికి వెళ్లొద్దని పోలీసుల హెచ్చరిక..ఆ నీళ్లలో ఏముంది?

July 5, 2025
Off Beat

పని చెయ్యకపోతే… అంతే సంగతులు.. ఫ‌న్నీ స్టోరీ..!

July 5, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.