Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వార్త‌లు

Ginger And Lemon : అల్లం, నిమ్మ‌కాయ మిశ్ర‌మాన్ని ప‌ర‌గ‌డుపున తాగితే.. ఊహించ‌ని లాభాలు క‌లుగుతాయి..!

D by D
October 29, 2022
in వార్త‌లు, హెల్త్ టిప్స్
Share on FacebookShare on Twitter

Ginger And Lemon : ప్ర‌కృతి ప్ర‌సాదించిన వ‌న‌మూలిక‌ల్లో అల్లం ఒక‌టి. భార‌తీయులు దాదాపు 5 వేల సంవ‌త్స‌రాలుగా అల్లాన్ని వంట‌ల్లో ఉప‌యోగిస్తున్నారు. కేవ‌లం వంట‌ల్లోనే కాకుండా ఔష‌ధాల త‌యారీలో కూడా అల్లాన్ని ఎంతో కాలంగా ఉప‌యోగిస్తున్నారు. అల్లంలో ఎన్నో విలువైన పోష‌కాలు ఉన్నాయి. అల్లంతో అద్భుత‌మైన వైద్యం చేయ‌వ‌చ్చ‌ని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అల్లాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. ఇందులో శ‌క్తివంత‌మైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ర‌క్తాన్ని శుద్ధి చేయ‌డంలో, ర‌క్త‌నాళాల్లో ర‌క్తం గ‌డ్డ‌క‌ట్ట‌కుండా చేయ‌డంలో అల్లం మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది.

అల్లాన్ని కొన్ని వారాల పాటు వాడ‌డం వ‌ల్ల కీళ్ల నొప్పులు త‌గ్గుతాయి. అల్లాన్ని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల క‌డుపులో పూత ఏర్ప‌డ‌కుండా ఉంటుంది. నోటి సంబంధిత స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలో, దంతాల‌ను ఆరోగ్యంగా ఉంచ‌డంలో, నోటి దుర్వాస‌న‌ను త‌గ్గించ‌డంలో అల్లం ఎంతో స‌హాయ‌ప‌డుతుంది. షుగ‌ర్ వ్యాధి గ్ర‌స్తుల‌కు అల్లం దివ్యౌష‌ధంగా ప‌ని చేస్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు. ర‌క్తంలోని చ‌క్కెర‌ల‌ను కండ‌రాల‌కు చేరే ప్ర‌క్రియ‌ను అల్లం వేగ‌వంతం చేస్తుంది. అజీర్తి, క‌డుపు ఉబ్బ‌రం వంటి స‌మ‌స్య‌ల‌ను మ‌నం అల్లాన్ని ఉప‌యోగించి న‌యం చేసుకోవ‌చ్చు. ద‌గ్గు, క‌ఫం వంటి స‌మ‌స్య‌ల‌ను కూడా మ‌నం అల్లాన్ని ఉప‌యోగించి త‌గ్గించుకోవ‌చ్చు.

Ginger And Lemon drink this mixture on empty stomach very effective
Ginger And Lemon

అదే విధంగా మ‌న‌కు ప్ర‌కృతిలో ల‌భించే వాటిల్లో నిమ్మ‌కాయ కూడా ఒక‌టి. ఇవి చ‌క్క‌టి రుచి, వాస‌న క‌లిగిన సిట్ర‌స్ జాతికి చెందిన కాయ‌లు. ఇవి మ‌న ఆరోగ్యానికి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. నిమ్మ‌కాయ‌ల‌ను ఉప‌యోగించ‌డం వ‌ల్ల మ‌నం అనేక అనారోగ్య స‌మ‌స్య‌లక దూరంగా ఉండ‌వ‌చ్చు. జీర్ణ‌శ‌క్తిని మెరుగుప‌ర‌చ‌డంలో కూడా నిమ్మ‌కాయ మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగప‌డుతుంది. మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే అల్లాన్ని, నిమ్మ‌ర‌సాన్ని వేరువేరుగా తీసుకోవ‌డానికి బ‌దులుగా వాటితో పానీయాన్ని త‌యారు చేసుకుని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం మ‌రిన్ని ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. ఈ పానీయాన్ని త‌యారు చేసుకోవ‌డానికి గానూ ముందుగా ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీటిని తీసుకుని వేడి చేయాలి. నీళ్లు వేడయ్యాక అల్లాన్ని క‌చ్చా ప‌చ్చాగా దంచి వేసి మ‌రిగించాలి.

త‌రువాత ఈ నీటిని వ‌డ‌క‌ట్టి గ్లాస్ లోకి తీసుకోవాలి. త‌రువాత ఈ నీటిలో నిమ్మ‌ర‌సాన్ని క‌లిపి తీసుకోవాలి. ఈ నీటిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగి బ‌రువు త‌గ్గుతారు. ఈ పానీయాన్ని రోజూ తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో ఉండే ఫ్రీ రాడిక‌ల్స్ న‌శిస్తాయి. చ‌ర్మ సౌంద‌ర్యం పెరుగుతుంది. చ‌ర్మం మృదువుగా నిగ‌నిగ‌లాడుతూ ఉంటుంది. ఇందులో ఉండే పోష‌కాలు క్యాన్స‌ర్ క‌ణాల‌ను న‌శింప‌జేస్తాయి. అల్లం, నిమ్మ‌ర‌సం క‌లిపిన నీటిని తీసుకోవ‌డం వ‌ల్ల వికారం స‌మ‌స్య నుండి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. ద‌గ్గుతో బాధ‌ప‌డే వారు ఈ పానీయాన్ని తీసుకోవ‌డం వల్ల చ‌క్క‌టి ఫ‌లితం ఉంటుంది.

ఈ పానీయాన్ని తీసుకోవ‌డం వ్ల‌ల శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెరిగి ఇన్ ఫెక్ష‌న్ ల బారిన ప‌డ‌కుండా ఉంటాం. మైగ్రేన్ త‌ల‌నొప్పి కూడా ఈ పానీయాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల త‌గ్గుతుంది. అల్లం, నిమ్మ‌ర‌సం క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల క‌లిగే మేలు అంతా ఇంతా కాద‌ని, ఈ పానీయాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల మనం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఈ పానీయాన్ని త‌ప్ప‌కుండా రోజు వారి ఆహారంలో భాగంగా చేసుకోవాల‌ని వారు సూచిస్తున్నారు.

Tags: Ginger And Lemon
Previous Post

Broad Beans Pickle : చిక్కుడు కాయ‌ల‌తో నిల్వ ప‌చ్చ‌డి ఎలా పెట్టాలో తెలుసా..? రుచి బాగుంటుంది..!

Next Post

Triglycerides : లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్‌లో ట్రైగ్లిజ‌రైడ్స్ ఎక్కువ‌గా ఉన్న‌ట్లు వ‌చ్చిందా.. అయితే ప్ర‌మాద‌మే.. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే..!

Related Posts

హెల్త్ టిప్స్

ఈ ఆహారాల‌ను రోజూ తింటే చాలు.. మీ ర‌క్తం శుభ్రంగా మారుతుంది..!

July 5, 2025
వ్యాయామం

మీ ఇంట్లోనే ఈ వ్యాయామాల‌ను చేయండి.. పైసా ఖ‌ర్చు లేకుండా బ‌రువు త‌గ్గుతారు..!

July 5, 2025
ప్ర‌శ్న - స‌మాధానం

4 ఏళ్ల నుంచి షుగ‌ర్‌కు మందులు వాడుతున్నా.. ఆయుర్వేద మందులతో త‌గ్గుతుందా..?

July 5, 2025
వినోదం

కేవ‌లం క‌న్య‌ల‌కు మాత్ర‌మే ప్ర‌వేశం ఉన్న ఆల‌యం అది.. ఆ ఊర్లో ఉంది.. త‌రువాత ఏమైంది..?

July 5, 2025
viral news

అంతర్వేదిలో స్నానానికి వెళ్లొద్దని పోలీసుల హెచ్చరిక..ఆ నీళ్లలో ఏముంది?

July 5, 2025
Off Beat

పని చెయ్యకపోతే… అంతే సంగతులు.. ఫ‌న్నీ స్టోరీ..!

July 5, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.