Beauty Tips : ప్రస్తుత కాలంలో వాతావరణ కాలుష్యం, మారిన జీవన విధానం, ఆహారపు అలవాట్ల కారణంగా చర్మ సంబంధిత సమస్యల బారిన పడే వారు ఎక్కువవుతున్నారు. ముఖం పై మొటిమలు, మచ్చలు, ముఖం నల్లగా మారడం, పిగ్మెంటేషన్ వంటి చర్మ సమస్యలు చిన్నా, పెద్దా అనే తేడా లేకుందా అందరిని వేధిస్తున్నాయి. రసాయనాలు కలిగిన సౌందర్య సాధనాలు వాడడం వల్ల కూడా ఈ చర్మ సమస్యలు తలెత్తె అవకాశం ఉంది. ఎటువంటి దుష్ప్రభావాలు లేని ఇంటి చిట్కా ఈ సమస్యలను తగ్గించడంలో అద్భుతుంగా పని చేస్తుంది. మన ఇంట్లోనే ఫేస్ ఫ్యాక్ ను తయారు చేసుకుని వాడడం వల్ల చర్మ సమస్యల నుండి మనం బయటపడవచ్చు.
చర్మ సమస్యలను తగ్గించి ముఖ సౌందర్యాన్ని పెంచే ఈ ఫేస్ ఫ్యాక్ ను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఫేస్ ఫ్యాక్ ను తయారు చేసుకోవడానికి మనం పెరుగును, అతి మధురం పొడిని, రోజ్ వాటర్ ను, కమలా మరియ్ నిమ్మ తొక్కల పొడిని ఉపయోగించాల్సి ఉంటుంది. అతి మధురం పొడి మనకు ఆయుర్వేద షాపుల్లో లభ్యమవుతుంది. సహజ సిద్దంగా చేసే అనేక సౌందర్య సాధనాల్లో ఈ అతి మధురం పొడిని ఉపయోగిస్తారు. అలాగే కమలా మరియు నిమ్మతొక్కల పొడి కూడా మనం బయట మార్కెట్ లో లభ్యమవుతుంది.
ఈ పొడిని మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. కమలా పండు తొక్కలను, నిమ్మతొక్కలను బాగా ఎండబెట్టి పొడిగా చేసి జల్లించాలి. తరువాత ఈ పొడిని నిల్వ చేసుకుని అవసరమైనప్పుడు ఉపయోగించుకోవచ్చు. ఈ ఫేస్ ఫ్యాక్ ను తయారు చేసుకోవడం కోసం ముందుగా ఒక గిన్నెలో ఒక టీ స్పూన్ కమలా మరియు నిమ్మ తొక్కల పొడిని తీసుకోవాలి. తరువాత ఇందులో ఒక అర టీ స్పూన్ అతి మధురం పొడిని, ఒక టీ స్పూన్ రోజ్ వాటర్ ను, ఒక టీ స్పూన్ పెరుగును వేసి పేస్ట్ లా కలుపుకోవాలి. తరువాత ఈ మిశ్రమాన్ని 10 నిమిషాల పాటు అలాగే ఉంచాలి.
10 నిమిషాల తరువాత ఈ మిశ్రమాన్ని చేత్తో కానీ బ్రష్ తో కానీ ముఖానికి రాసుకోవాలి. తరువాత ఈ మిశ్రమం పూర్తిగా ఆరే వరకు ముఖం మీద అలాగే ఉంచాలి. తరువాత నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి మూడు సార్లు ఈ చిట్కాను పాటించడం వల్ల ముఖం అందంగా, కాంతివంతంగా మారుతుంది. ఎండ వల్ల నల్లగా మారిన చర్మం కూడా ఈ చిట్కాను పాటించడం వల్ల తెల్లగా మారుతుంది. ముఖం పై వచ్చే మొటిమలు, మచ్చలు కూడా తగ్గుతాయి. ఈ చిట్కాను పాటించడం వల్ల మనం ఇంట్లోనే కూర్చొని చక్కటి సౌందర్యాన్ని సొంతం చేసుకోవచ్చు.