Kasinda Chettu : కసవింద మొక్క.. దీనిని మనలో చాలా మంది చూసే ఉంటారు. ఈ మొక్క ఎక్కడపడితే అక్కడ విరివిరిగా పెరుగుతుంది. అయితే ఈ మొక్క ఒక ఔషధ మొక్క అని మనలో చాలా మందికి తెలియదు. దీనిని సంస్కృతంలో కాసాలి, కాసమర్దా అని హిందిలో కసౌండి అని పిలుస్తారు. ఈ మొక్కను చెన్నంగి చెట్టు అని కూడా పిలుస్తారు. కసవింద చెట్టు ఆకులతో పచ్చడిని, కారం పొడిని కూడా తయారు చేసుకుంటారు. ఈ మొక్కను ఉపయోగించడం వల్ల మనం అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. పొట్టలోని మలినాలను తొలగించి సుఖవిరోచనం అయ్యేలా చేయడంలో ఈ మొక్క మనకు ఎంతో దోహదపడుతుంది. కేవలం ఆకుల్లోనే కాదు ఈ మొక్క ప్రతి భాగంలో కూడా ఔషధ గుణాలు ఉన్నాయి. కసవింద చెట్టు ఆకులు చేదు రుచిని కలిగి ఉంటాయి. శరీరంలో వాతాన్ని, విషాన్ని హరించి వేయడంలో గాయాలను, గడ్డలను, చర్మ సంబంధిత సమస్యలను తగ్గించడంలో ఈ మొక్క మనకు దోహపడుతుంది.
కసవింద చెట్టు ఆకులను మెత్తగా నూరి పక్షవాతం వల్ల చచ్చుబడిపోయిన శరీర భాగాలపై రాస్తూ మర్దనా చేయాలి. ఇలా చేయడం వల్ల కొన్ని రోజుల్లోనే చచ్చుబడిపోయిన శరీర భాగాలు చక్కగా పని చేస్తాయి. కసవింద మొక్కను సమూలంగా సేకరించి ఎండబెట్టి పొడిగా చేయాలి. ఈ పొడికి తేనెను కలిపి చర్మ సమస్యలు ఉన్న చోట లేపనంగా రాయడం వల్ల చర్మ సమస్యలతో పాటు పుండ్లు, గాయాలు, వ్రణాలు తగ్గుతాయి. కసవింద గింజలను సేకరించి ఎండబెట్టి పొడిగా చేయాలి. ఈ పొడిని నీటిలో వేసి కషాయంలా తయారు చేసుకోవాలి, ఈ కషాయంలో పాలు, కండచక్కెర కలిపి టీ లా తయారు చేసుకుని తాగుతూ ఉంటే సమస్త మూత్ర సంబంధిత సమస్యలు తగ్గుతాయి. రక్తం శుద్ధి అవుతుంది. అతి మూత్ర సమస్యతో బాధపడే వారు ఈ చెట్టు గింజలను దోరగా వేయించి పొడిగా చేసి నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని పావు టీ స్పూన్ మోతాదులో తీసుకుని ఒక టీ స్పూన్ తేనెతో కలిపి తీసుకోవాలి. దీనిని రెండు పూటలా ఆహారానికి ఒక గంట ముందు తీసుకోవాలి.
ఇలా చేయడం వల్ల అతి మూత్ర సమస్య తగ్గుతుంది. అలాగే స్త్రీలల్లో వచ్చే తెల్లబట్ట సమస్యను తగ్గించడంలో కూడా కసవింద చెట్టు మనకు సహాయపడుతుంది. ఈ చెట్టు బెరడును 20 గ్రాముల మోతాదులో తీసుకుని అర లీటర్ నీటిలో వేసి 10 నిమిషాల పాటు మరిగించి కషాయంలా తయారు చేసుకోవాలి. స్త్రీలు మూత్ర విసర్జనకు వెళ్లిన ప్రతిసారి ఈ కషాయంతో యోనిని శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల స్త్రీలల్లో వచ్చే తెల్లబట్ట సమస్య తగ్గుతుంది. ఈ మొక్క వేరు బెరడును సేకరించి ఎండబెట్టి పొడిగా చేసుకుని జల్లించి నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని రోజుకు రెండు పూటలా 2 గ్రాముల నుండి 5 గ్రాముల మోతాదులో తీసుకుని ఒక టీ స్పూన్ నాటు ఆవు నెయ్యితో కలిపి తినాలి. దీనిని భోజనానికి ఒక గంట ముందు తీసుకోవవాలి. ఇలా చేయడం వల్ల బోధకాలు వాపు తగ్గుతుంది. ఈ పొడిని తీసుకున్న మొదట్లో విరోచనాలు అయ్యే అవకాశం ఉంది. కనుక కొద్ది మోతాదులో మొదలు పెట్టి ఎక్కువగా తీసుకోవాలి.
అలాగే కసవింద వేరు పొడిని 2 నుండి 3 గ్రాముల మోతాదులో తీసుకుని ఒక టీ స్పూన్ తేనెతో కలిపి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల శరీరంలోని చెడు నీరంతా పోయి ఉబ్బు రోగం తగ్గుతుంది. కసవింద మొక్క ఆకుల రసాన్ని గాయాలపై రాసి ఈ ఆకు ముద్దను గాయాలపై ఉంచి కట్టుకట్టాలి. ఇలా చేయడం వల్ల గాయాల నుండి రక్తం కారడం తగ్గడంతో పాటు గాయాలు కూడా త్వరగా మానుతాయి. కసవింద చెట్టు పూలను దంచి వాటి నుండి రసాన్ని తీయాలి. ఈ రసాన్ని ఒకటి లేదా రెండు చుక్కల మోతాదులో కళ్లల్లో వేసుకోవడం వల్ల రేచీకటి సమస్య తగ్గుతుంది. ఈ చెట్టు వేరును 10 గ్రాముల మోతాదులో తీసుకుని ఒక గ్లాస్ నీటిలో వేసి ఒక కప్పు కషాయం అయ్యే వరకు మరిగించాలి.
తరువాత ఈ కషాయాన్ని వడకట్టుకుని తాగుతూ ఉంటే చలిజ్వకం వెంటనే తగ్గుతుంది. 20 గ్రాముల కసవింద ఆకులకు 12 మిరియాలను కలిపి మెత్తగా నూరి ఆ రసాన్ని నీటితో కలిపి పాము కరిచిన వారికి తాగించాలి. అలాగే ఈ ఆకులను ముద్దగా చేసి పాము కరిచిన చోట ఉంచి కట్టు కట్టాలి. ఇలా రోజుకు రెండు నుండి మూడు సార్లు చేయడం వల్ల ఎటువంటి పాము కరిచిన ఆ విషం అనేది విరిగిపోతుంది. ఈ విధంగా కసవింద చెట్టు మనకు ఎంతగానో ఉపయోగపడుతుందని దీనిని వాడడం వల్ల మనం అనేక రకాల అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.