Gaddi Chamanthi For Black Hair : మనకు రోడ్ల పక్కన, మన ఇంటి పరిసరాల్లో, పొలాల గట్ల మీద విరివిరిగా లభించే మొక్కల్లో గడ్డి చామంతి మొక్క ఒకటి. దీనిని పిచ్చి చామంతి మొక్క, పలకాకు మొక్క, గాయపాకు మొక్క అని కూడా అంటారు. గడ్డి చామంతి మొక్కను సంస్కృతంలో జయంతి వేద అని పిలుస్తారు. కొన్ని ప్రాంతాల్లో దీనిని కూరగా వండుకుని కూడా తింటారు. చాలా మంది ఈ మొక్కను పిచ్చి మొక్కగా భావిస్తారు. కానీ ఇది ఒక అద్భుతమైన ఔషధ మొక్క. ఈ మొక్కలోని ఔషధ గుణాల గురించి తెలిస్తే ఆశ్చర్య పడకమానరని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఆయుర్వేద వైద్యంలో ఈ మొక్కను విరివిరిగా ఉపయోగిస్తూ ఉంటారు.
గడ్డి చామంతి మొక్కలోని ఔషధ గుణాల గురించి అలాగే ఈ మొక్కను ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మలబద్దకం, అజీర్తి వంటి వాటి కారణంగా తలెత్తే మొలల సమస్యను తగ్గించడంలో ఈ గడ్డి చామంతి మొక్క మనకు ఎంతో ఉపయోగపడుతుంది. మొలల సమస్య కారణంగా బాధపడే వారు మనలో చాలా మంది ఉండే ఉంటారు. కొందరిలో ఈ మొలల కారణంగా రక్తస్రావం కూడా కలుగుతుంది. గడ్డి చామంతి మొక్కను ఉపయోగించడం వల్ల మనం చాలా సులభంగా ఈ సమస్య నుండి బయట పడవచ్చు. గుప్పెడు గడ్డి చామంతి మొక్క ఆకులను సేకరించి శుభ్రంగా కడిగి ఆరబెట్టాలి. తరువాత వాటని రోట్లో వేసుకోవాలి.
ఇందులోనే పది తోక మిరియాలను వేసి మెత్తగా నూరుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఉసిరికాయంత పరిమాణంలో ముద్దగా చేసుకుని రోజూ ఉదయం పరగడుపున తినాలి. ఇలా తిన్న తరువాత 100 ఎమ్ ఎల్ పలుచటి మజ్జిగలో కొద్దిగా పటిక బెల్లాన్ని కలుపుకుని తాగాలి. ఇలా చేయడం వల్ల మొలల నుండి రక్తం కారడం ఆగడంతో పాటు మొలల వల్ల కలిగే నొప్పి, దురద వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. ఈ విధంగా గడ్డి చామంతిని వాడడం వల్ల మొలల సమస్య నుండి మనకు సత్వర ఉపశమనం కలుగుతుంది. అలాగే గడ్డి చామంతి మొక్క యాంటీ సెప్టిక్ గుణాలను కూడా కలిగి ఉంటుంది. గాయాలు తగిలినప్పుడు ఈ మొక్క ఆకుల రసాన్ని గాయాలపై రాయడం వల్ల గాయాల నుండి రక్తం కారడం ఆగడంతో పాటు గాయాలు కూడా త్వరగా మానుతాయి. అంతేకాకుండా ఈ ఆకుల రసాన్ని చర్మం పైపూతగా రాయడం వల్ల వివిధ రకాల చర్మ సమస్యలు తగ్గుతాయి. గడ్డి చామంతిని ఉపయోగించిమనం షుగర్ వ్యాధిని కూడా నియంత్రణలో ఉంచుకోవచ్చు.
అలాగే ఈ మొక్క ఆకులకు నీటిలో ఉండే ఫ్లోరైడ్ శాతాన్ని తగ్గించే గుణం కూడా ఉందని పరిశోధనల్లో తేలింది. తెల్ల వెంట్రుకలను నల్లగా మార్చే శక్తి కూడా ఈ గడ్డి చామంతి మొక్కకు ఉంది. గడ్డి చామంతి ఆకుల రసాన్ని, గుంటగలగరాకు ఆకుల రసాన్ని అలాగే నల్ల నువ్వుల నూనెను సమానంగా తీసుకోవాలి. తరువాత వీటన్నింటిని కలిపి చిన్న మంటపై కేవలం నూనె మిగిలే వరకు మరిగించాలి. ఈ నూనె చల్లారిన తరువాత ఒక సీసాలోకి తీసుకుని నిల్వ చేసుకోవాలి. ఈ నూనెను తగిన మోతాదులో తీసుకుని గోరు వెచ్చగా అయ్యే వరకు వేడి చేసి జుట్టుకు బాగా పట్టించాలి. రాత్రి పడుకునే ముందు ఈవిధంగా జుట్టుకు రాసుకుని ఉదయాన్నే కడిగి వేయాలి. ఇలా చేయడం వల్ల సహజంగా జుట్టు నల్లగా మారుతుంది. ఈవిధంగా గడ్డి చామంతి మొక్క మనకు ఎంతో ఉపయోగపడుతుందని దీనిని వాడడం వల్ల వివిధ రకాల అనారోగ్య సమస్యల నుండి మనం చాలా సులభంగా బయట పడవచ్చని నిపుణులు చెబుతున్నారు.