Jaggery With Warm Water : ఉదయం నిద్రలేవగానే పరగడుపున గోరు వెచ్చని నీటిని తాగడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని మనందరికి తెలిసిందే. ఇలా గోరు వెచ్చని నీటిని తాగడం వల్ల రక్తప్రసరణ వ్యవస్థ మెరుగుపడుతుంది. మలబద్దకం వంటి సమస్యలు తగ్గి జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది. అయితే కేవలం గోరు వెచ్చని నీటిని మాత్రమే కాకుండా ఒక చిన్న బెల్లం ముక్కను తిని ఆ తరువాత గోరు వెచ్చని నీటిని తాగడం వల్ల మనం మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇలా బెల్లం ముక్కను తీసుకుని వేడి నీటిని తాగడం వల్ల మనం అనేక అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఈ విధంగా ఉదయం పరగడుపున బెల్లం ముక్క తిని వేడి నీటిని తాగడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.
శరీరం పనితీరు, శరీరంలో జీవక్రియల రేటు పెరుగుతుంది. ముఖ్యంగా బెల్లంలో మన శరీరానికి అవసరమయ్యే విటమిన్ సి, విటమిన్ బి1, బి6 , ఐరన్, క్యాల్షియం, పొటాషియం, పాస్ఫరస్, మెగ్నీషియం వంటి పోషకాలు ఎన్నో ఉన్నాయి. ఈ పోషకాలు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ విధంగా బెల్లం, వేడి నీటిని తీసుకోవడం వల్ల మన శరీరంలో కొవ్వు కరిగి మనం అధిక బరువు సమస్య నుండి కూడా బయటపడవచ్చు. మూత్రపిండాల్లో రాళ్లు ఉన్న వారు ఉదయం పరగడుపున బెల్లం తిని వేడి నీటిని తాగడం వల్ల అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు. అలాగే మొటిమలు, మచ్చలు, చర్మం రంగు పాలిపోయినట్టు ఉండడం వంటి సమస్యలతో బాధపడే వారు ఈ విధంగా పరగడుపున బెల్లాన్ని, వేడి నీటిని తీసుకుంటూ ఉండడం వల్ల కొద్ది రోజుల్లోనే చర్మ సమస్యలు తగ్గి చర్మం కాంతివంతంగా, ఆరోగ్యంగా మారుతుంది.
చర్మం పై ముడతలు కూడా రాకుండా ఉంటాయి. అలాగే విరేచనాలు, గ్యాస్, మలబద్దకం వంటి సమస్యలతో బాధపడే వారు కూడా రాత్రి పడుకునే ముందు బెల్లం ముక్క తిని ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిని తాగడం వల్ల ఆయా జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గు ముఖం పడతాయి. నిద్రలేమి, గురక వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు కూడా రాత్రి పడుకునే ముందు బెల్లాన్ని తీసుకుని వేడి నీటిని తాగాలి. ఇలా చేయడం వల్ల మనసుకు ప్రశాంతత లభించి నిద్ర చక్కగా పడుతుంది.
అలాగే బెల్లాన్ని చక్కెరకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించుకోవడం మంచిది. చక్కెరను ఉపయోగించడం వల్ల ఎటువంటి ఉపయోగం లేకపోగా అనేక అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది. బెల్లాన్ని ఉపయోగించి తీపి వంటకాలను తయారు చేసుకోవడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. బెల్లం తినడం వల్ల దంతాలు, చిగుళ్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ విధంగా రోజూ ఉదయం పరగడుపున అలాగే రాత్రి పూట బెల్లాన్ని తిని ఒక గ్లాస్ వేడి నీటిని తాగడం వల్ల మనం అనేక అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.