Lungs Clean : మన శరీరంలో నిరంతరం పని చేసే అవయవాల్లో ఊపిరితిత్తులు ఒకటి. మనకు ఆహారం నీరు ఎంత అవసరమో గాలి కూడా అంతే అవసరం. నీటిని తీసుకోకుండా, ఆహారాన్ని తీసుకోకుండా మనం కొద్ది రోజుల పాటు జీవించవచ్చు కానీ శ్వాస తీసుకోకుండా మనం కొన్ని నిమిషాల పాటు కూడా జీవించలేము. మనం జీవించి ఉండాలంటే మన ఊపిరితిత్తులు నిరంతరం పని చేస్తూనే ఉండాలి. కనుక మనం ఊపిరితిత్తులను ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, శుభ్రంగా ఉంచుకోవాలి. కానీ ప్రస్తుత కాలంలో చాలా మంది ధూమపానానికి అలవాటు పడి ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని దెబ్బతీసుకుంటున్నారు. ధూమపానం కారణంగా ఊపిరితిత్తులు దెబ్బతినడంతో పాటు మన చర్మం, జుట్టు, మెదడు వంటి వాటిపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి.
ఒక్కసారి ధూమపానం చేయడం వల్ల నాలుగు వేల రకాల రసాయనాలు బయటకు వస్తాయని తేలింది. ఇందులో 400 పైగా విష పూరితమైనవి. అలాగే 43 కు పైగా రసాయనాలు క్యాన్సర్ బారిన పడేలా చేస్తాయి. ఈ రసాయనాలన్నీ కూడా మన రక్తంలో కలిసి రక్తాన్ని విష పూరితం చేస్తాయి. ఇలా విష పూరితమైన రక్తం మన శరీరంలో అన్ని అవయవాలకు సరఫరా అవుతుంది. దీంతో మనల్ని అనేక రకాల అనారోగ్య సమస్యలు చుట్టు ముడతాయి. శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా తగ్గుతుంది. ధూమపానం చేయడం వల్ల ముందుగా ఊపిరితిత్తులు దెబ్బ తింటాయి. ఆరోగ్యంగా ఉండే వారిలో ఊపిరితిత్తులు పింక్ రంగులో ఉంటాయి. ధూమపానం చేసే వారిలో ఊపిరితిత్తులు నలుపు రంగులో ఉంటాయి.
ఈ ఊపిరితిత్తులు క్రమంగా రక్తాన్ని కూడా నలుపు రంగులోకి మార్చేస్తాయి. కనుక మనం ధూమపానం వల్ల ఊరిపితిత్తుల్లో పేరుకుపోయిన విష పదార్థాలను తొలగించి ఊపిరితిత్తులను శుభ్రంగా , ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా అవసరం. మన ఇంట్లో ఉండే పదార్థాలతో ఒక పానీయాన్ని తయారు చేసుకుని తాగడం వల్ల ఊపిరితిత్తుల్లో ఉండే మలినాలు తొలగిపోయి ఊపిరితిత్తులు శుభ్రంగా అవుతాయి. ఈ పానీయాన్ని తీసుకోవడం వల్ల రక్తం కూడా శుద్ధి అవుతుంది. ఊపిరితిత్తులను శుభ్రపరిచే ఈ పానీయాన్ని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పానీయాన్ని తయారు చేసుకోవడానికి గానూ మనం అల్లం రసం, దాల్చిన చెక్క, నిమ్మరసం, తేనెను, కాయిన్ పెప్పర్ పొడిని ఉపయోగించాల్సి ఉంటుంది. దీని కోసం ముందుగా ఒక గ్లాస్ వేడి నీటిని తీసుకోవాలి.
తరువాత అందులో పావు టీ స్పూన్ కాయిన్ పెప్పర్ పొడిని, ఒక పావు టీ స్పూన్ దాల్చిన చెక్క పొడిని, ఒక టేబుల్ స్పూన్ అల్లం రసాన్ని, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని, 2 టేబుల్ స్పూన్ల తేనెను వేసి కలపాలి. ఇలా తయారు చేసుకున్న పానీయాన్ని రోజూ రాత్రి పడుకునే ముందు టీ తాగినట్టు కొద్ది కొద్దిగా తాగుతూ ఉండాలి. ఈ పానీయాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన మలినాలు, విష పదార్థాల అన్నీ తొలగిపోతాయి. ఊపిరితిత్తుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. రక్తం కూడా శుభ్రపడుతుంది. శరీరంలో జీవక్రియల రేటు పెరుగుతుంది. ధూమపానం కారణంగా పాడైపోయిన ఊపిరితిత్తులు ఈ పానీయాన్ని తీసుకోవడం వల్ల మరలా ఆరోగ్యంగా తయారవుతాయి.