Dhaba Style Tomato Curry : మనం వంటగదిలో విరివిరిగా ఉపయోగించే కూరగాయల్లో టమాటాలు ఒకటి. మన ఆరోగ్యానికి టమాటాలు ఎంతో మేలు చేస్తాయి. టమాటాలతో మనం వివిధ రకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. టమాటాలతో చేసుకోదగిన వంటకాల్లో టమాట కర్రీ కూడా ఒకటి. ఈ టమాట కూరను మనం తరచూ ఇంట్లోనే వండుతూనే ఉంటాం. చాలా మంది ఈ టమాట కర్రీని ఇష్టంగా తింటారు. ఈ టమాట కర్రీని మరింత రుచిగా దాబా స్టైల్ లో ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి…అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
దాబా స్టైల్ టమాట కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
టమాట ఫ్యూరీ – 200 గ్రా., నూనె – 50 ఎమ్ ఎల్, జీలకర్ర – అర టీ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, ఎండుమిర్చి – 3, చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు – 100 గ్రా., చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, గరం మసాలా – అర టీ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత, జీలకర్ర పొడి – ఒక టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, కరివేపాకు – రెండు రెమ్మలు, పెద్ద ముక్కలుగా తరిగిన టమాటాలు – పావు కిలో, నీళ్లు – 200 ఎమ్ ఎల్.
దాబా స్టైల్ టమాట కర్రీ తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసనపోయే వరకు వేయించాలి. తరువాత గరం మసాలా, కారం, ఉప్పు, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి వేయించాలి. తరువాత టమాట ఫ్యూరీ, కరివేపాకు వేసి నూనె పైకి తేలే వరకు వేయించాలి. తరువాత టమాట ముక్కలు వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత నీళ్లు పోసి కలపాలి. దీనిని చిన్న మంటపై నూనె పైకి తేలే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే దబా స్టైల్ టమాట కర్రీ తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, రోటీ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ టమాట కూరను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. తరచూ చేసే టమాట కర్రీ కంటే ఈ విధంగా తయారు చేసిన టమాట కర్రీ మరింత రుచిగా ఉంటుంది.