Litchi For Fat : ప్రస్తుత కాలంలో చాలా మంది శరీరంలో వివిధ భాగాల్లో కొవ్వు పేరుకుపోయి అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ముఖ్యంగా పొట్ట దగ్గర కొవ్వు పేరుకుపోయి ఇబ్బందులకు గురి అవుతున్నవారిని మనం చూస్తూనే ఉంటాం. మన ఆహారపు అలవాట్లు, జీవన విధానమే ఇలా పొట్ట దగ్గర కొవ్వు ఎక్కువగా పేరుకుపోయేలా చేస్తున్నాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే సాధారణంగా పురుషుల్లో పొట్ట భాగం దగ్గర కొవ్వు కణాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ కొవ్వు కణాలు పొట్ట భాగం దగ్గర పెద్ద పరిమాణంలో ఉంటాయి. శరీరం బరువు పెరిగినప్పుడు పురుషుల్లో ముందుగా పొట్ట భాగం పెరుగుతుంది. అదే స్త్రీలల్లో ఈ కొవ్వు కణాలు తొడల భాగంలో, పిరుదుల భాగంలో ఎక్కువగా ఉంటాయి. కనుక బరువు పెరిగినప్పుడు స్త్రీలల్లో తొడల భాగం, పిరుదుల భాగం పెద్దగా అవుతుంది.
కొంతమంది స్త్రీలల్లో తొడలు, పిరుదులు పెరగడంతో పాటు పొట్ట భాగం కూడా పెరుగుతుంది. అధిక బరువుతో బాధపడే వారిలో పొట్ట భాగం పెద్దగా ఉండడాన్ని మనం గమనించవచ్చు. ఈ సమస్యతో బాధపడే వారు పొట్ట తగ్గితే బాగుంటుందని అనుకుంటూ ఉంటారు. శరీరంలో ఇతర భాగాల్లో పేరుకుపోయిన కొవ్వు కంటే పొట్ట భాగంలో పేరుకుపోయిన కొవ్వు మన ఆరోగ్యానికి ఎక్కువ నష్టాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే పొట్ట భాగంలో పేరుకుపోయిన కొవ్వు ఊపిరితిత్తుల మీద, డయాఫ్రామ్ మీద, పక్కటెముకల మీద, కండరాల మీద చెడు ఫ్రభావాన్ని చూపిస్తుంది. దీని వల్ల శరీరంలో శక్తి తగ్గిపోవడం, బద్దకంగా ఉండడం, ఆయాసం రావడం, గురక రావడం వంటి సమస్యలు తలెత్తుతాయి. పొట్ట భాగంలో పేరుకుపోయిన కొవ్వును వీలైనంత త్వరగా కరిగించుకోవడం చాలా మంచిది. అ పొట్ట భాగంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలో మనకు లిచీ ఫ్రూట్ ఎంతగానో ఉపయోగపడుతుంది.
లిచీ ఫ్రూట్ ముఖ్యంగా పొట్ట భాగంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలో ఎంతగానో దోహదపడుతుందని శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లో వెల్లడైంది. లిచీ ఫ్రూట్ లో ఉండే ఒలిగోనల్ అనే మూలకం పొట్ట భాగంలో కొవ్వు కరిగేలా చేయడంలో, ఆ భాగంలో కొవ్వు పేరుకుపోకుండా చేయడంలో సహాయపడుతుందని నిపుణులు కనుగొన్నారు. ఈ లిచీ ఫ్రూట్ మనకు ప్రస్తుత కాలంలో విరివిరిగా లభ్యమవుతుంది. పొట్ట భాగంలో కొవ్వు పేరుకుపోయి ఇబ్బందులకు గురి అవుతున్నవారు ఈ లిచీ ఫ్రూట్ ను తినడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. అలాగే ఈ ఫ్రూట్ లో రూటిన్ అనే ఫైబర్ ఉంటుంది. ఇది మనం తిన్న ఆహారంలో ఉండే కొవ్వు పదార్థాలను శరీరం ఎక్కువగా గ్రహించకుండా చేయడంలో తోడ్పడుతుంది. కాబట్టి పొట్ట భాగంలో కొవ్వు తగ్గాలనుకునే వారు, శరీరంలో కొవ్వు ఎక్కువగా పేరుకుపోయి ఇబ్బందులకు గురి అవుతున్నవారు లిచీ ఫ్రూట్ ను తీసుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.