Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home food

Aloo Goru Chikkudu Iguru : ఆలు గోరు చిక్కుడు ఇగురును ఇలా చేస్తే.. ఎంతో రుచిగా ఉంటుంది.. నోట్లో నీళ్లూర‌డం ఖాయం..

D by D
January 18, 2023
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Aloo Goru Chikkudu Iguru : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో గోరు చిక్కుడు కాయ‌లు కూడా ఒక‌టి. ఇత‌ర కూర‌గాయ‌ల వ‌లె గోరు చిక్కుడు కాయ‌లు కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ర‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. ఈ గోరు చిక్క‌డు కాయ‌ల‌తో బంగాళాదుంప‌ల‌ను క‌లిపి ఎంతో రుచిగా ఇగురును త‌యారు చేసుకోవ‌చ్చు. ఆలూ గోరుచిక్క‌డు కాయ ఇగురు చాలా రుచిగా ఉంటుంది. ఇంట్లో అంద‌రూ ఈ కూర‌ను విడిచి పెట్ట‌కుండా తింటారు. రుచితో పాటు ఆరోగ్యానికి మేలు చేసే ఆలూ గోరు చిక్క‌డుకాయ ఇగురును ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాల ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ఆలూ గోరు చిక్కుడుకాయ ఇగురు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

త‌రిగిన గోరు చిక్కుడు కాయ‌లు – పావు కిలో, త‌రిగిన బంగాళాదుంప‌లు – 2, నూనె – 2 టేబుల్ స్పూన్స్, తాళింపు దినుసులు – ఒక టీ స్పూన్, ఎండుమిర్చి – 1, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, పొడుగ్గా త‌రిగిన ఉల్లిపాయ – 1, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, ఉప్పు – త‌గినంత‌, త‌రిగిన టమాటాలు – 2, ప‌సుపు – అర టీ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్, గ‌రం మ‌సాలా – అర టీ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Aloo Goru Chikkudu Iguru recipe in telugu make in this method
Aloo Goru Chikkudu Iguru

ఆలూ గోరు చిక్కుడు కాయ ఇగురు త‌యారీ విధానం..

ముందుగా ఒక క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక తాళింపు దినుసులు, ఎండుమిర్చి, క‌రివేపాకు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్క‌లు, ప‌చ్చిమిర్చి వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్క‌లు వేగిన త‌రువాత గోరు చిక్కుడు ముక్క‌లు, ఉప్పు వేసి క‌ల‌పాలి. వీటిపై మూత పెట్టి ముక్క‌ల‌ను మ‌గ్గించాలి. గోరు చిక్కుడు ముక్క‌లు స‌గంకు పైగా మ‌గ్గిన త‌రువాత బంగాళాదుంప ముక్క‌ల‌ను వేసి క‌ల‌పాలి. త‌రువాత వీటిపై మూత పెట్టి బంగాళాదుంప ముక్క‌ల‌ను పూర్తిగా మ‌గ్గించాలి. త‌రువాత ట‌మాట ముక్క‌లు, అర టీ గ్లాస్ నీళ్లు పోసి ట‌మాట ముక్క‌ల‌ను మెత్త‌గా మ‌గ్గించాలి.

ట‌మాట ముక్క‌లు చ‌క్క‌గా మ‌గ్గిన త‌రువాత ప‌సుపు, కారం, గ‌రం మ‌సాలా వేసి క‌ల‌పాలి. వీటిని రెండు నిమిషాల పాటు క‌లుపుతూ వేయించిన త‌రువాత కొత్తిమీర చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఆలూ గోరు చిక్కుడు ఇగురు త‌యార‌వుతుంది. దీనిని అన్నం, చ‌పాతీ, రోటీ, పుల్కా వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. గోరు చిక్క‌డు కాయ‌ల‌ను ఇష్ట‌ప‌డ‌ని వారు కూడా ఈ విధంగా చేసిన కూర‌ను ఎంతో ఇష్టంగా తింటారు.

Tags: Aloo Goru Chikkudu Iguru
Previous Post

Roasted Black Chana : న‌ల్ల శ‌న‌గ‌ల‌ను ఇలా చేసుకుని తినండి.. రోజూ తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

Next Post

Potatoes : ఆలుగ‌డ్డ‌ల‌ను వేయించి లేదా చిప్స్ రూపంలో ఎక్కువ‌గా తింటున్నారా.. అయితే ఈ విష‌యం తెలుసుకోవాల్సిందే..!

Related Posts

ఆధ్యాత్మికం

మీ ఇంటి వద్ద‌కు వ‌చ్చి కాకి ప‌దే ప‌దే అరుస్తుందా..? దాని అర్థం ఏమిటంటే..?

July 4, 2025
ఆధ్యాత్మికం

దేశంలో ఉన్న 18 అష్టాద‌శ శ‌క్తి పీఠాలు ఎక్క‌డ ఉన్నాయి..? అవి ఏమిటి..?

July 4, 2025
ఆధ్యాత్మికం

దీపారాధ‌న‌కు అస‌లు ఏ నూనె వాడాలి..? దీపారాధ‌న ఎలా చెయ్యాలి..?

July 4, 2025
వినోదం

70 ఏళ్ల వ‌య‌స్సులోనూ ర‌జ‌నీకాంత్ అంత ఫిట్‌గా ఉన్నారంటే..? ఆయ‌న పాటించే దిన‌చ‌ర్య ఎలాంటిదంటే..?

July 4, 2025
technology

స్మార్ట్‌ఫోన్ల పై భాగంలో ఉండే రంధ్రాన్ని ఎప్పుడైనా గ‌మ‌నించారా..? అదేమిటో తెలుసా..?

July 4, 2025
lifestyle

బుల్లెట్ బైక్‌ నే దేవుడిగా చేసి, పూజలు చేస్తున్న గ్రామస్తులు, దీని వెనక పెద్ద కథే ఉంది.!

July 4, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.