Brinjal For Cholesterol : ప్రస్తుత కాలంలో మనలో చాలా మంది ఊబకాయం, గుండెపోటు వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఈ సమస్యలకు ప్రధాన కారణం మన శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోవడమే. కొలెస్ట్రాల్ మన శరీరానికి అవసమరమే అయినప్పటికి చాలా మందిలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతున్నాయి. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడం వల్ల ఊబకాయం, రక్తనాళాల్లో పూడికలు, గుండె సంబంధిత సమస్యలు, ఛాతిలో నొప్పి, ఫ్యాటీ లివర్, మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలు ఇలా అనేక రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. కొలెస్ట్రాల్ ఎక్కువగా పేరుకుపోవడం వల్ల ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లే అవకాశం ఉంది.
మారిన ఆహారపు అలవాట్లే ఈ సమస్య తలెత్తడానికి ప్రధాన కారణం. జంక్ ఫుడ్ ను ఎక్కువగా తీసుకోవడం, నూనెలో వేయించిన పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం, పంచదారతో తయారు చేసిన పదార్థాలను తీసుకోవడం చేత శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా పేరుకుపోతుంది. అలాగే శరీరానికి శ్రమ లేకపోవడం, వ్యాయామం చేయకపోవడం వంటి కారణాల చేత కూడా శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది. శరీరంలో అధికంగా పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను మనం చాలా సులభంగా తొలగించుకోవచ్చు. శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను కరిగించడంలో మనకు వంకాయలు ఎంతో దోహదపడతాయి. వంకాయల్లో ఫైబర్ తో పాటు సపోనిన్స్ అనే రసాయన సమ్మేళనం కూడా ఉంది.
ఇది శరీరంలో అధికంగా ఉన్న కొలెస్ట్రాల్ ను కరిగించడంలో సహాయపడుతుంది. చాలా మంది వంకాయలను ఆహారంగా తీసుకున్నప్పటికి నూనె ఎక్కువగా వేసి వంకాయ కూరలను తయారు చేస్తూ ఉంటారు. దీంతో ఆరోగ్యానికి మేలు చేసే వంకాయ కూడా అనారోగ్యానికి దారి తీస్తుంది. చాలా తక్కువ నూనెను ఉపయోగించి వారానికి రెండు సార్లు వంకాయలతో కూరలను తయారు చేసుకుని తినడం వల్ల మనం శరీరంలో అధికంగా ఉన్న కొలెస్ట్రాల్ ను తొలగించుకోవచ్చు. అలాగే బీన్స్ ను వారంలో రెండు సార్లు తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు సాధారణ స్థితికి చేరుకుంటాయి. వీటిలో ఉండే ఫైబర్, కాపర్, పొటాషియం, విటమిన్ ఇ, విటమిన్ కె వంటి పోషకాలు కొలెస్ట్రాల్ ను కరిగేలా చేయడంలో దోహదపడతాయి.
ఈ కూరగాయలను తీసుకోవడంతో పాటు జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలి. ప్రతిరోజూ తప్పకుండా వ్యాయామం చేయాలి. శరీరానికి తగినంత శ్రమ ఉండేలా చూసుకోవాలి. వీలైనంత వరకు పచ్చి కూరగాయలు, పండ్లు తీసుకోవడానికి ప్రయత్నించాలి. ఈ చిట్కాలను పాటించడం వల్ల మనం శరీరంలో అధఙకంగా ఉన్న కొలెస్ట్రాల్ ను చాలా సులభంగా కరిగించుకోవచ్చు.