Cucumber For Weight Loss : ప్రస్తుత కాలంలో మనల్ని వేధిస్తున్న అనారోగ్య సమస్యల్లో అధిక బరువు సమస్య కూడా ఒకటి. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఈ సమస్య బారిన పడుతున్నారు. అధిక బరువు బారిన పడడానికి అనేక కారణాలు ఉన్నాయి. జంక్ ఫుడ్ ను అధికంగా తీసుకోవడం, నూనెలో వేయించిన పదార్థాలను తీసుకోవడం, పంచదారతో చేసిన పదార్థాలను తీసుకోవడం, వ్యాయామం చేయకపోవడం వంటి వివిధ కారణాల చేత మనం అధిక బరువు సమస్య బారిన పడుతున్నాము. అధిక బరువు వల్ల మనం బీపీ, షుగర్, థైరాయిడ్, గుండె జబ్బులు వంటి వివిధ రకాల అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంది. కనుక మనం అధిక బరువును సాధ్యమైనంత త్వరగా తగ్గించుకోవాలి. అధిక బరువు సమస్య నుండి బయటపడడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వ్యాయామం చేయడం, ఆహార నియమాలు పాటించడం వంటివి చేస్తూ ఉంటారు.
అలాగే మార్కెట్ లో వివిధ రకాల బరువు తగ్గించే మందులను వాడుతూ ఉంటారు. ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పటికి మనలో చాలా మంది బరువు తగ్గరు. ఇలా అధిక బరువు సమస్యతో బాధపడే వారు ఒక చిన్న చిట్కాను పాటించడం వల్ల చాలా సులభంగా బరువు తగ్గవచ్చు. ఈ చిట్కాను తయారు చేసుకుని వాడడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. అలాగే ఈ చిట్కా తయారీలో ఉపయోగించే ప్రతి పదార్థం కూడా సహజ సిద్దమైనవే. దీనిని తయారు చేసుకోవడం కూడా చాలా తేలిక. బరువు తగ్గించే ఈ చిట్కాను ఎలా తయారు చేసుకోవాలి..తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి… దీనిని ఎలా వాడాలి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గానూ మనం కీరదోసకాయను, ఒక ఇంచు అల్లం ముక్కను, అర చెక్క నిమ్మరసాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా అల్లంపై ఉండే పొట్టును తీసి ముక్కలుగా చేసుకోవాలి.
అలాగే కీరదోసను కూడా ముక్కలుగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక జార్ లో అల్లం ముక్కలను, కీరదోస ముక్కలను వేసి జ్యూస్ లాగా చేసుకోవాలి. తరువాత ఈ జ్యూస్ ను ఒక గ్లాస్ లోకి తీసుకుని అందులో నిమ్మరసం వేసి కలపాలి. ఇలా తయారు చేసుకున్న కీరదోస జ్యూస్ ను రోజూ ఉదయం పరగడుపున తాగాలి. అలాగే దీనిని తాగిన ఒక గంట వరకు ఎలాంటి ఆహారాన్ని తీసుకోకూడదు. ఈ జ్యూస్ తయారీలో ఉపయోగించిన ప్రతి పదార్థం కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇవి శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలో ఎంతో సహాయపడతాయి. ఈ విధంగా కీరదోస జ్యూస్ ను తయారు చేసుకుని వాడడం వల్ల మనం బరువు తగ్గడంతో పాటు అనేక ఇతర ప్రయోజనాలను కూడా సొంతం చేసుకోవచ్చు. ఈ జ్యూస్ ను తాగడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణ వ్యవస్థ సక్రమంగా పని చేస్తుంది. శరీరం డీహైడ్రేషన్ కు గురికాకుండా ఉంటుంది. ఈ విధంగా మన ఇంట్లో అల్లం, కీరదోస, నిమ్మరసంతో జ్యూస్ ను తయారు చేసుకుని తాగడం వల్ల మనం బరువు తగ్గడంతో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు.