రోజుకు ఒక యాపిల్‌ను తింటే డాక్టర్ వద్దకు వెళ్లాల్సిన అవసరమే రాదు.. అనే సామెత అందరికీ తెలిసిందే. అయితే అది నిజమే. ఎందుకంటే.. యాపిల్ పండ్లలో అంతటి అసాధారణ పోషక విలువలు ఉంటాయి. అవి అనేక ఆరోగ్యకర ప్రయోజనాలను అందిస్తాయి. యాపిల్ పండ్లలో చాలా తక్కువ క్యాలరీలు ఉండడమే కాదు.. వాటిని తినడం వల్ల బరువు తగ్గుతారు. డయాబెటిస్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి. గుండె ఆరోగ్యం సురక్షితంగా ఉంటుంది.
అయితే యాపిల్ పండు రెండు రకాల అనారోగ్యల సమస్యలకూ ఒకే ఔషధంగా పనిచేస్తుంది. విరేచనాలు, మలబద్దకం ఉన్నవారు యాపిల్ పండును తింటే ఆయా అనారోగ్య సమస్యల నుంచి బయట పడవచ్చు. అదేంటీ.. విరేచనాలు, మలబద్దకం రెండూ అపోజిట్ కదా.. రెండింటికీ ఒకటే పండు ఔషధంగా ఎలా పనిచేస్తుంది.. అంటే.. దానికి ఒక చిట్కా ఉంది. అదేమిటంటే…
విరేచనాల సమస్య ఉన్న వారు యాపిల్ పండును పొట్టు తీసేసి తినాలి. దీంతో లోపలి గుజ్జులో ఉండే సాల్యుబుల్ ఫైబర్ విరేచనాలను తగ్గిస్తుంది. ఇక మలబద్దకం ఉన్నవారు పొట్టుతో యాపిల్ తినాలి. ఎందుకంటే యాపిల్ పండు పొట్టులో ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది. ఇది విరేచనం అయ్యేలా చేస్తుంది. దీంతో మలబద్దకం తగ్గుతుంది.