Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home food

Aloo Beans Masala Fry : ఆలు బీన్స్ మ‌సాలా ఫ్రై.. ఇలా చేయండి.. రైస్‌లోకి టేస్టీగా ఉంటుంది..!

D by D
March 12, 2023
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Aloo Beans Masala Fry : మ‌నం ఆహారంగా తీసుకోద‌గిన కూర‌గాయ‌ల్లో బీన్స్ కూడా ఒక‌టి. బీన్స్ కూడా మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాల‌ను క‌లిగి ఉంటాయి. ఇవి మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కానీ వీటిని చాలా మంది తిన‌డానికి ఇష్ట‌ప‌డ‌రు. బీన్స్ ను నేరుగా తిన‌డం ఇష్టం లేని వారు వీటితో బంగాళాదుంప‌ల‌ను క‌లిపి ఎంతో రుచిగా ఉండే ఫ్రైను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఆలూ బీన్స్ క‌లిపి చేసే ఈ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. బీన్స్ ను ఇష్ట‌ప‌డని వారు కూడా ఈ ఫ్రైను ఇష్టంగా తింటారు. రుచిగా, సుల‌భంగా ఆలూ బీన్స్ ఫ్రై ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆలూ బీన్స్ మ‌సాలా ఫ్రై త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

త‌రిగిన బంగాళాదుంప‌లు – పావుకిలో, త‌రిగిన బీన్స్ – పావుకిలో, స‌న్నగా పొడుగ్గా తరిగిన పెద్ద ఉల్లిపాయ – 1, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, వెల్లుల్లి రెబ్బ‌లు – 8, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, గ‌రం మ‌సాలా – ఒక టీ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్, ప‌సుపు – అర టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, నూనె – ఒక టేబుల్ స్పూన్, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 2.

Aloo Beans Masala Fry recipe in telugu very tasty with rice
Aloo Beans Masala Fry

ఆలూ బీన్స్ మ‌సాలా ఫ్రై త‌యారీ విధానం..

ముందుగా గిన్నెలో నీటిని తీసుకోవాలి. ఇందులో బంగాళాదుంప ముక్క‌లు, బీన్స్ వేసి క‌ల‌పాలి. త‌రువాత వీటిపై మూత పెట్టి బంగాళాదుంప ముక్క‌ల‌ను స‌గానికి పైగా ఉడికించాలి. త‌రువాత వీటిని వ‌డ‌క‌ట్టి ఒక ప్లేట్ లోకి తీసుకుని ప‌క్క‌కు ఉంచాలి. ఇప్పుడు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక తాళింపు దినుసులు, ఎండుమిర్చి వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు, క‌రివేపాకు, ప‌చ్చిమిర్చి వేసి వేయించాలి. త‌రువాత వెల్లుల్లి రెబ్బ‌లు, ఉడికించిన ఆలూ, బీన్స్ వేసి క‌ల‌పాలి. వీటిని రెండు నిమిషాల పాటు వేయించిన త‌రువాత మూత పెట్టి 5 నిమిషాల పాటు వేయించాలి. త‌రువాత ఉప్పు, ప‌సుపు, కారం, ధ‌నియాల పొడి, గ‌రం మ‌సాలా వేసి క‌ల‌పాలి. వీటిని మ‌రో నిమిషం పాటు వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఆలూ బీన్స్ మ‌సాలా ఫ్రై త‌యార‌వుతుంది. దీనిని అన్నం, చ‌పాతీ వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది.

Tags: Aloo Beans Masala Fry
Previous Post

Ghee : రోజూ నెయ్యి తింటున్నారా.. అయితే ముందు ఇవి తెలుసుకోండి.. లేదంటే స‌మ‌స్య‌లు వ‌స్తాయి..!

Next Post

Akupatri : బిర్యానీ ఆకు.. వంట‌ల‌కే కాదు.. ఎన్నో రోగాల‌ను త‌గ్గించ‌గ‌ల‌దు తెలుసా..?

Related Posts

ఆధ్యాత్మికం

గాజులు ధరించడం వల్ల స్త్రీలకు ఎలాంటి లాభాలు ఉన్నాయో తెలుసా..?

June 8, 2025
వినోదం

మోక్షజ్ఞ జాతకంలో అది కలిసి రాదు అంటూ సంచలన కామెంట్స్ చేసిన వేణు స్వామి..!!

June 8, 2025
వినోదం

ఖుషి సినిమాలో నటించిన ముంతాజ్ ఇప్పుడెలా ఉందొ తెలుసా ? ఏమి చేస్తుందంటే ?

June 8, 2025
వైద్య విజ్ఞానం

డ‌యాబెటిస్ ఉన్న‌వారికి గుండె పోటు ఎందుకు వ‌స్తుంది..?

June 8, 2025
హెల్త్ టిప్స్

కేవలం పండ్లు లేదా వెజిట‌బుల్ జ్యూస్‌ల‌ను తాగితే క‌లిగే లాభాలు ఇవే..!

June 8, 2025
చిట్కాలు

త‌ల‌నొప్పి త‌గ్గేందుకు ఈ 4 ఆహారాలను తీసుకోవ‌చ్చు.. కానీ..?

June 8, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
lifestyle

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

by Admin
May 22, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!