ప్రపంచ వ్యాప్తంగా అధిక శాతం మందిని ఇబ్బందులకు గురిచేస్తున్న సమస్యల్లో.. హైబీపీ కూడా ఒకటి. ఇది వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి. రక్తనాళాల గోడలపై రక్తం తీవ్రమైన ఒత్తిడిని కలిగిస్తుంటుంది. దీన్నే హైబీపీ అంటారు. అయితే రక్తపోటును నిర్లక్ష్యం చేస్తే.. గుండె జబ్బులు, స్ట్రోక్స్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కానీ ఆరంభంలోనే రక్తపోటు వచ్చిందని తెలిపే పలు లక్షణాలు కనిపిస్తాయి. వాటిని గుర్తించి అందుకు తగిన విధంగా చికిత్స తీసుకుంటే.. రక్తపోటు సమస్య నుంచి బయట పడవచ్చు. మరి హైబీపీ ఉందని తెలిపే ఆ లక్షణాలు ఏమిటంటే..
* హైపీబీ ఉంటే ముఖమంతా కొన్ని సార్లు ఉబ్బిపోయినట్లు కనిపిస్తుంది. ముఖం ఎర్రగా మారుతుంది. ముఖంలో ఉండే రక్తనాళాలు వెడల్పుగా మారి రక్తం ఎక్కువగా ప్రసరిస్తుంది. దీంతో ముఖం ఎర్రగా కనిపిస్తుంది.
* హైబీపీ ఉంటే మైకం కమ్మినట్లు అనిపిస్తుంది. మత్తుగా ఉంటారు. నిద్ర బాగా పోయినా సరే.. మత్తుగా ఉంటుంటే హైబీపీ అని అనుమానించాలి.
* హైబీపీ ఉన్నవారి కళ్లలో ఎర్ర రక్తకణాలకు చెందిన మచ్చలు చిన్నగా కనిపిస్తాయి. అవి ఎర్రగా ఉంటాయి.
* బీపీ మరీ ఎక్కువగా ఉంటే చూపు సరిగ్గా ఉండదు. మసకగా కనిపిస్తుంది.
* కంగారు, ఆందోళన, అలసట, నిద్రలేమి సమస్యలు ఉంటే హైబీపీగా అనుమానించాలి.
* ఛాతిలో నొప్పి వస్తుంటే దాన్ని హైబీపీగా అనుమానించాలి.
* బీపీ ఎక్కువగా ఉంటే కొన్ని సార్లు ముక్కులోంచి రక్తం పడుతుంది. తలనొప్పి తీవ్రంగా ఉంటుంది.
* హైబీపీ ఉన్నవారికి కడుపులో వికారంగా అనిపిస్తుంది. మూత్రం తక్కువగా వస్తుంది. చేతులు, పాదాలు, ఇతర భాగాల్లో స్పర్శ కోల్పోయి మొద్దు బారినట్లు అనిపిస్తుంది.
* హైబీపీ మరీ ఎక్కువైతే కొందరికి మూర్ఛ కూడా వస్తుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కూడా వస్తాయి.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365