Green Face Pack : మనలో చాలా మందికి ముఖం తెల్లగా, అందంగా ఉన్నప్పటికి వాతావరణ కాలుష్యం, ఎండలో తిరగడం, ఎండలో పని చేయడం, దుమ్ము, ధూళి కారణంగా తెల్లగా ఉన్న చర్మం నల్లగా మారుతుంది. చర్మంపై దుమ్ము, ధూళి పేరుకుపోయి అందంగా ఉన్న ముఖం నిర్జీవంగా, కాంతిహీనంగా తయారవుతుంది. ఇటువంటి సమస్యతో బాధపడే వారు ఎండలో తిరిగి వచ్చిన తరువాత ఈ చిట్కాను పాటించడం వల్ల ఎండ వల్ల నల్లగా మారిన చర్మం తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటుంది. ఈ చిట్కాను వాడడం వల్ల ఎండ వల్ల ఏర్పడిన నలుపు అలాగే చర్మంపై ఉండే దుమ్ము, ధూళి, మృతకణాలు తొలగిపోయి చర్మం అందంగా, కాతివంతంగా తయారవుతుంది.
ఈ చిట్కాను వాడడం వల్ల మనం చక్కటి ఫలితాలను సొంతం చేసుకోవచ్చు. ఎండ వల్ల నల్లగా మారిన చర్మాన్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకు రావడంలో ఈ చిట్కా అద్భుతంగా పని చేస్తుంది. ముఖాన్ని తెల్లగా మార్చే ఈ చిట్కాను ఎలా తయారు చేసుకోవాలి…తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈచిట్కాను తయారు చేసుకోవడానికి ఒక గిన్నెలో 2 టీ స్పూన్ల పచ్చి పాలను తీసుకోవాలి. తరువాత ఇందులో అర టీ స్పూన్ కలబంద గుజ్జును వేసి కలపాలి. ఇక చివరగా ఇందులో విటమిన్ ఇ క్యాప్సుల్ ను వేసి కలపాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఉపయోగించే ముందు ముఖం శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. అలాగే దీనిని రాత్రి పడుకునే ముందుగా ఉపయోగించాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి బాగా పట్టించాలి.
దీనిని అర గంట పాటు అలాగే ఉంచుకుని ఆ తరువాత సబ్బు ఉపయోగించకుండా కేవలం నీటితో శుభ్రం చేసుకోవాలి. ఉదయాన్నే ముఖాన్ని సబ్బుతో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎండ వల్ల నల్లగా మారిన చర్మం తిరిగి తెల్లగా మారుతుంది. అలాగే చర్మ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అందవిహీనంగా నిర్జీవంగా మారిన చర్మం ఆరోగ్యంగా, కాంతివంతంగా తయారవుతుంది. ముఖంపై మరీ నల్లగా మారిన వారు ఈ చిట్కాను క్రమం తప్పకుండా వారం రోజుల పాటు ఉపయోగించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ విధంగా ఈ చిట్కాను వాడడం వల్ల మనం చాలా సులభంగా ముఖాన్ని అందంగా, తెల్లగా మార్చుకోవచ్చు.