Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home food

Bhindi Masala Curry : ధాబా స్టైల్ బెండ‌కాయ మ‌సాలా కూర‌.. ఎంతో రుచిగా ఉంటుంది.. ఎలా చేయాలంటే..?

D by D
March 19, 2023
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Bhindi Masala Curry : మ‌నం బెండ‌కాయ‌ల‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. బెండ‌కాయ‌ల‌తో చేసే కూర‌లు సుల‌భంగా చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది బెండ‌కాయ‌ల‌తో చేసిన కూర‌ల‌ను ఇష్టంగా తింటారు. బెండ‌కాయ‌లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి కూడా. ఈ బెండ‌కాయ‌ల‌తో మ‌నం చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో బెండ‌కాయ మ‌సాలా కూర కూడా ఒక‌టి. ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా తేలిక‌. బెండకాయ మ‌సాలా క‌ర్రీ మ‌న‌కు ధాబాలల్లో ఎక్కువ‌గా ల‌భిస్తుంది. దీనిని అదే రుచితో మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా ఉండే బెండ‌కాయ మ‌సాలా కూర‌ను ధాబా స్టైల్ లో ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

బిండి మ‌సాలా క‌ర్రీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

బెండ‌కాయ‌లు – పావు కిలో, త‌రిగిన ట‌మాటాలు – 2, త‌రిగిన ఉల్లిపాయ – 1, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, ధ‌నియాల పొడి – ఒక టేబుల్ స్పూన్, గ‌రం మ‌సాలా – ఒక టీ స్పూన్, పెరుగు – 50 గ్రా., జీల‌కర్ర – ఒక టీ స్పూన్, ఉప్పు- త‌గినంత‌, కారం – ఒక టేబుల్ స్పూన్, ప‌సుపు – పావు టీ స్పూన్, నూనె – 2 టేబుల్ స్పూన్స్, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Bhindi Masala Curry recipe in telugu make in this method
Bhindi Masala Curry

బిండి మ‌సాలా క‌ర్రీ త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక బెండ‌కాయ ముక్క‌ల‌ను వేసి వేయించాలి. వీటిని ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత అదే నూనెలో జీల‌క‌ర్ర‌, ఉల్లిపాయ ముక్క‌లు, ప‌చ్చిమిర్చి, క‌రివేపాకు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్క‌లు వేగిన త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత ట‌మాట ముక్క‌లు వేసి క‌ల‌పాలి. ఈ ట‌మాట ముక్క‌ల‌ను మెత్త‌గా అయ్యే వ‌ర‌కు వేయించిన త‌రువాత ఉప్పు, కారం, ప‌సుపు, ధ‌నియాల పొడి, గ‌రం మ‌సాలా, పెరుగు వేసి క‌ల‌పాలి. దీనిని నూనె పైకి తేలే వ‌ర‌కు వేయించిన త‌రువాత వేయించిన బెండ‌కాయ ముక్క‌లు వేసి క‌ల‌పాలి.

త‌రువాత ఒక గ్లాస్ నీళ్లు పోసి క‌ల‌పాలి. ఇప్పుడు దీనిపై మూత‌పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించాలి. ఇలా ఉడికించిన త‌రువాత కొత్తిమీర వేసి క‌లుపుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే బిండి మ‌సాలా క‌ర్రీ త‌యార‌వుతుంది. అన్నం, చ‌పాతీ వంటి వాటితో క‌లిపి తింటే ఈ మ‌సాలా క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. బెండ‌కాయ‌ల‌తో త‌ర‌చూ చేసే వంట‌కాల‌తో పాటు అప్పుడ‌ప్పుడూ ఇలా మ‌సాలా క‌ర్రీని కూడా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. బెండ‌కాయ‌లు తిన‌ని వారు కూడా ఈ మ‌సాలా క‌ర్రీని ఎంతో ఇష్టంగా తింటారు.

Tags: Bhindi Masala Curry
Previous Post

Pimples : దీన్ని రాస్తే చాలు.. ముఖంపై మొటిమ‌లు, న‌ల్ల మ‌చ్చ‌లు అస‌లు ఉండ‌వు..!

Next Post

Cracked Heels Remedy : ఇది రాస్తే చాలు.. పాదాల ప‌గుళ్లు పోతాయి.. అందంగా మారుతాయి..!

Related Posts

lifestyle

ఒంటరిగా ఉన్నప్పుడు నా భార్య ఫోర్స్ చేస్తోంది.. అలా ఉందామంటూ..!!

July 5, 2025
వినోదం

సర్కారు వారి పాటలో ఈ మిస్టేక్ ను గమనించారా? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు అబ్బా!

July 5, 2025
వినోదం

శ్రీమంతుడు నుంచి బలగం కథలు దొంగలించారంటూ..! వివాదాస్పదంగా నిలిచిన 10 సినిమాలు ఇవేనా ?

July 5, 2025
ఆధ్యాత్మికం

వెంక‌టేశ్వ‌ర స్వామికి శ‌నివారం అంటే ఎందుకు అంత ఇష్టం..?

July 5, 2025
ఆధ్యాత్మికం

ఇంటి ప్ర‌ధాన ద్వారానికి మామిడి ఆకుల తోర‌ణాల‌నే ఎందుకు క‌డ‌తారు..?

July 5, 2025
ఆధ్యాత్మికం

ఆల‌యాల్లో గంట‌ను ఎందుకు కొడ‌తారు..? దీని వ‌ల్ల ఉప‌యోగం ఏమిటి..?

July 5, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.