Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home food

Tomato Kaju Masala Curry : ట‌మాటాలు, జీడిప‌ప్పు క‌లిపి ఇలా మ‌సాలా కూర‌ను చేయండి.. చ‌పాతీల్లోకి సూప‌ర్‌గా ఉంటుంది..!

D by D
March 30, 2023
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Tomato Kaju Masala Curry : ట‌మాట కాజు మ‌సాలా కర్రీ.. మ‌న‌కు రెస్టారెంట్ లలో, ధాబాల‌లో ల‌భించే కూర‌ల‌ల్లో ఇది ఒక‌టి. జీడిప‌ప్పు, ట‌మాటాలు క‌లిపి చేసే ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. ఎక్కువ‌గా దీనిని నాన్, రోటీ వంటి వాటితో క‌లిపి తింటూ ఉంటారు. అచ్చం అదే రుచితో ఈ కూర‌ను మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. వంటరాని వారు, మొద‌టి సారి చేసే వారు, బ్యాచిల‌ర్స్ ఇలా ఎవ‌రైనా దీనిని త‌యారు చేయ‌వ‌చ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ ట‌మాట కాజు మ‌సాలా కూర‌ను మ‌నం ఇంట్లో ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ట‌మాట కాజు మ‌సాలా కర్రీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – 3 టేబుల్ స్పూన్స్, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, చిన్న‌గా త‌రిగిన పెద్ద ఉల్లిపాయ‌లు – 2, క‌రివేపాకు – 2 రెమ్మ‌లు, ఎండుమిర్చి – 3, జీడిప‌ప్పు ప‌లుకులు – 75 గ్రా., అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, గ‌రం మ‌సాలా – అర టీ స్పూన్, జీల‌క‌ర్ర పొడి – ఒక టీ స్పూన్, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, పెద్ద ట‌మాటాలు – 2, త‌రిగిన ట‌మాటాలు – 3, , జీడిప‌ప్పు పేస్ట్ – 2 టేబుల్ స్పూన్స్, నీళ్లు – పావు లీట‌ర్, నెయ్యి – ఒక టేబుల్ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – రెండు టేబుల్ స్పూన్స్.

Tomato Kaju Masala Curry recipe in telugu taste better with chapati
Tomato Kaju Masala Curry

ట‌మాట కాజు మ‌సాలా క‌ర్రీ త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక జీల‌క‌ర్ర వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి. వీటిని 70 శాతం వేయించిన త‌రువాత ఎండుమిర్చి, క‌రివేపాకు వేసి వేయించాలి. త‌రువాత జీడిప‌ప్పు ప‌లుకులు వేసి ఎర్ర‌గా వేయించాలి. త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించాలి. ఇలా వేయించిన త‌రువాత గ‌రం మ‌సాలా, ఉప్పు, కారం, జీల‌క‌ర్ర పొడి, ధ‌నియాల పొడి వేసి క‌ల‌పాలి. త‌రువాత ట‌మాటాల‌ను ఫ్యూరీ లాగా చేసుకుని వేసుకోవాలి. దీనిని నూనె పైకి తేలే వ‌ర‌కు వేయించిన త‌రువాత ట‌మాట ముక్క‌లు వేసి మెత్త‌గా అయ్యే వ‌ర‌కు వేయించాలి.

ట‌మాట ముక్క‌లు మెత్త‌బ‌డిన త‌రువాత జీడిప‌ప్పు పేస్ట్ వేసి క‌ల‌పాలి. దీనిని నూనె పైకి తేలే వ‌ర‌కు వేయించిన త‌రువాత నీళ్లు, నెయ్యి వేసి క‌ల‌పాలి. ఇప్పుడు కూర‌ను ద‌గ్గ‌ర ప‌డే వ‌ర‌కు ఉడికించుకుని కొత్తిమీర చ‌ల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ట‌మాట కాజు మ‌సాలా క‌ర్రీ త‌యార‌వుతుంది. దీనిని అన్నం, చ‌పాతీ, రోటీ, నాన్ వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ కూర‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Tags: Tomato Kaju Masala Curry
Previous Post

Palakova : పాల‌కోవాను 10 నిమిషాల్లో ఇలా ఈజీగా చేయ‌వ‌చ్చు.. నోట్లో వేసుకోగానే క‌రిగిపోతుంది..!

Next Post

Whiten Teeth : దంతాల‌పై ఉండే గార పోయి తెల్ల‌గా మారుతాయి.. ఇలా చేస్తే చాలు..!

Related Posts

ఆధ్యాత్మికం

మీ ఇంటి వద్ద‌కు వ‌చ్చి కాకి ప‌దే ప‌దే అరుస్తుందా..? దాని అర్థం ఏమిటంటే..?

July 4, 2025
ఆధ్యాత్మికం

దేశంలో ఉన్న 18 అష్టాద‌శ శ‌క్తి పీఠాలు ఎక్క‌డ ఉన్నాయి..? అవి ఏమిటి..?

July 4, 2025
ఆధ్యాత్మికం

దీపారాధ‌న‌కు అస‌లు ఏ నూనె వాడాలి..? దీపారాధ‌న ఎలా చెయ్యాలి..?

July 4, 2025
వినోదం

70 ఏళ్ల వ‌య‌స్సులోనూ ర‌జ‌నీకాంత్ అంత ఫిట్‌గా ఉన్నారంటే..? ఆయ‌న పాటించే దిన‌చ‌ర్య ఎలాంటిదంటే..?

July 4, 2025
technology

స్మార్ట్‌ఫోన్ల పై భాగంలో ఉండే రంధ్రాన్ని ఎప్పుడైనా గ‌మ‌నించారా..? అదేమిటో తెలుసా..?

July 4, 2025
lifestyle

బుల్లెట్ బైక్‌ నే దేవుడిగా చేసి, పూజలు చేస్తున్న గ్రామస్తులు, దీని వెనక పెద్ద కథే ఉంది.!

July 4, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.