Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home food

Soya Pulao : ఏం వండాలో తెలియ‌క‌పోతే ఇలా సోయా పులావ్ చేయండి.. రుచి అదిరిపోతుంది..!

D by D
April 22, 2023
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Soya Pulao : మ‌నం మీల్ మేక‌ర్ ల‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. మీల్ మేక‌ర్ ల‌తో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. మీల్ మేక‌ర్ ల‌తో కేవ‌లం కూర‌లు, చిరుతిళ్లే కాకుండా మ‌నం ఎంతో రుచిగా ఉండే పులావ్ ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. మీల్ మేక‌ర్ పులావ్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఎవ‌రైనా చాలా తేలిక‌గా త‌యారు చేసుకోవ‌చ్చు. రుచిగా, తేలిక‌గా మీల్ మేక‌ర్ పులావ్ ను ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

మీల్ మేక‌ర్ పులావ్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

మీల్ మేక‌ర్ – ఒక క‌ప్పు, అర గంట పాటు నాన‌బెట్టిన బాస్మ‌తీ బియ్యం – 2 క‌ప్పులు, నెయ్యి – ఒక టేబుల్ స్పూన్, నూనె – 2 టేబుల్ స్పూన్స్, బిర్యానీ ఆకులు – 2, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క‌, ల‌వంగాలు – 5, యాల‌కులు – 4, సాజీరా – అర టీ స్పూన్, అనాస పువ్వు – 1, పొడుగ్గా త‌రిగిన ఉల్లిపాయ‌లు – అర క‌ప్పు, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 4, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, త‌రిగిన బంగాళాదుంప – 1, త‌రిగిన క్యారెట్ – 1, త‌రిగిన ట‌మాట – 1, ప‌సుపు – పావు టీ స్పూన్, కారం – 2 టీ స్పూన్స్, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, గ‌రం మ‌సాలా – ఒక టీ స్పూన్, చిలికిన పెరుగు – అర క‌ప్పు, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, త‌రిగిన పుదీనా- కొద్దిగా, నీళ్లు – మూడుంపావు క‌ప్పులు.

Soya Pulao recipe in telugu very tasty how to make it
Soya Pulao

మీల్ మేక‌ర్ పులావ్ త‌యారీ విధానం..

ముందుగా మీల్ మేక‌ర్ ల‌లో వేడి నీటిని పోసి 10 నిమిషాల పాటు నాన‌బెట్టాలి. త‌రువాత వీటిని చేత్తో పిండి ఒక గిన్నెలోకి తీసుకుని ప‌క్కకు ఉంచాలి. త‌రువాత క‌ళాయిలో నూనె, నెయ్యి వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక మ‌సాలా దినుసులు వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ‌, ప‌చ్చిమిర్చివేసి వేయించాలి. త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత మీల్ మేక‌ర్, బంగాళాదుంప ముక్క‌లు, క్యారెట్, ట‌మాట వేసి క‌ల‌పాలి. వీటిని 5 నిమిషాల పాటు వేయించిన త‌రువాత కారం, ఉప్పు, ప‌సుపు, ధ‌నియాల పొడి, గ‌రం మ‌సాలా, పెరుగు వేసి క‌ల‌పాలి. త‌రువాత వీటిపై మూత పెట్టి మ‌రో 5 నిమిషాల పాటు ఉడికించాలి. త‌రువాత కొత్తిమీర‌, పుదీనా వేసి క‌ల‌పాలి. ఇప్పుడు బియ్యం వేసి నెమ్మ‌దిగా క‌ల‌పాలి.

త‌రువాత నీళ్లు పోసి క‌లిపి మూత పెట్టి మ‌ధ్య‌స్థ మంట‌పై 6 నిమిషాల పాటు ఉడికించాలి. ఇలా ఉడికించ‌డం వ‌ల్ల నీరు ద‌గ్గ‌ర ప‌డుతుంది. దీనిని మ‌రోసారి క‌లిపి పైన కొత్తిమీర‌ను చ‌ల్లుకుని మూత పెట్టి చిన్న మంట‌పై మ‌రో 6 నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత మూత తీయ‌కుండా మ‌రో 10 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ త‌రువాత స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే మీల్ మేక‌ర్ పులావ్ త‌యార‌వుతుంది. దీనిని రైతా లేదా మ‌సాలా కూర‌ల‌తో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. మీల్ మేక‌ర్ ల‌తో త‌ర‌చూ చేసే వంట‌కాల‌తో పాటు అప్పుడ‌ప్పుడూ ఇలా కూడా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. దీనిని ఇంట్లో అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Tags: Soya Pulao
Previous Post

Mulla Vankaya Plant : ముళ్ల వంగ మొక్క తెలుసా.. దీంతో ఎన్ని ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయంటే..?

Next Post

Biyyam Vadiyalu : బియ్యంతో ఎంతో సులువుగా వడియాల‌ను ఇలా పెట్టుకోవ‌చ్చు.. ఒక చిన్న టెక్నిక్‌..!

Related Posts

ఆధ్యాత్మికం

మీ ఇంటి వద్ద‌కు వ‌చ్చి కాకి ప‌దే ప‌దే అరుస్తుందా..? దాని అర్థం ఏమిటంటే..?

July 4, 2025
ఆధ్యాత్మికం

దేశంలో ఉన్న 18 అష్టాద‌శ శ‌క్తి పీఠాలు ఎక్క‌డ ఉన్నాయి..? అవి ఏమిటి..?

July 4, 2025
ఆధ్యాత్మికం

దీపారాధ‌న‌కు అస‌లు ఏ నూనె వాడాలి..? దీపారాధ‌న ఎలా చెయ్యాలి..?

July 4, 2025
వినోదం

70 ఏళ్ల వ‌య‌స్సులోనూ ర‌జ‌నీకాంత్ అంత ఫిట్‌గా ఉన్నారంటే..? ఆయ‌న పాటించే దిన‌చ‌ర్య ఎలాంటిదంటే..?

July 4, 2025
technology

స్మార్ట్‌ఫోన్ల పై భాగంలో ఉండే రంధ్రాన్ని ఎప్పుడైనా గ‌మ‌నించారా..? అదేమిటో తెలుసా..?

July 4, 2025
lifestyle

బుల్లెట్ బైక్‌ నే దేవుడిగా చేసి, పూజలు చేస్తున్న గ్రామస్తులు, దీని వెనక పెద్ద కథే ఉంది.!

July 4, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.