Smelly Urine : మన శరీరంలో ఉండే వ్యర్థాలు, మలినాలు మూత్రం ద్వారా బయటకు పోతాయన్న సంగతి మనకు తెలిసిందే. మనం ప్రతిరోజూ మూత్రవిసర్జన చేయడం చాలా అవసరం. మూత్రం సహజంగానే వాసనను, రంగును కలిగి ఉంటుంది. ఈ వాసన, రంగు శరీరతత్వాన్ని బట్టి మారుతూ ఉంటాయి. అలాగే మన శరీరంలో ఏవైనా అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా మూత్రం యొక్క వాసన, రంగు మారుతూ ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అయితే మన మూత్రం యొక్క వాసన, రంగును బట్టి మన శరీరంలో ఉండే అనారోగ్య సమస్యల గురించి కూడా తెలుసుకోవచ్చని వారు చెబుతున్నారు. మూత్రం వాసనను బట్టి శరీరంలో ఉండే అనారోగ్య సమస్యల గురించి ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. శరీరం డీ హైడ్రేషన్ కు గురి అయినప్పుడు కూడా మూత్రం వాసన వస్తుందని నిపుణులు చెబుతున్నారు. మన శరీరంలో ఉండే నీటితో పాటు వ్యర్థాలు కూడా మూత్రం ద్వారా బయటకు వస్తాయి.
మనం నీటిని ఎక్కువగా తాగితే నీటి శాతం ఎక్కువగా అమ్మోనియా శాతం తక్కువగా ఉంటుంది. అదే నీరు తక్కువగా తాగినప్పుడు నీటి శాతం తక్కువగా అమ్మోనియా శాతం ఎక్కువగా ఉంటుంది. దీంతో మూత్రం ఎక్కువ వాసన వస్తుంది. మూత్రం కషాయం లేదా తేనె రంగులో ఉంటే శరీరం తీవ్ర హైడ్రేషన్ బారిన పడినట్టు గుర్తించి నీటిని ఎక్కువగా తాగాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే కాపీ ఎక్కువగా తాగడం వల్ల కూడా మూత్రం రంగు, వాసన ఘాటుగా ఉంటుందని నిపుణులు తెలియజేస్తున్నారు. కాఫీ ఎక్కువగా తాగడం కూడా మూత్ర విసర్జనకు దారి తీస్తుంది. ఇది మూత్రం రంగు, వాసనపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. కనుక కాఫీ తాగే ముందు నీటిని ఎక్కువగా తాగడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. అదే విధంగా యుటిఐ ( యూరీనరి ట్రాక్ ఇన్ఫెక్షన్ ల కారణంగా కూడా మూత్రం ఘాటైన వాసనను, రంగును కలిగి ఉంటుంది. అంతేకాకుండా మూత్ర విసర్జన సమయంలో మంట, చికాకు కూడా ఉంటుందని ఈ పరిస్థితి తలెత్తిన వెంటనే వైద్యున్ని సంప్రదించడం మంచిదని వారు చెబుతున్నారు.
అలాగే స్త్రీలల్లో తలెత్తే ఈస్ట్ ఇన్ఫెక్షన్ ల కారణంగా కూడా మూత్రం వాసన, రంగు గాడతను కలిగి ఉంటుదని నిపుణులు చెబుతున్నారు. ఈస్ట్ యోనితో పాటు శరీరంలో ఇతర భాగాల్లో కూడా నివసిస్తుంది. అలాగే ఇది ఇతరులకు కూడా సంక్రమించే అవకాశం ఉంది. ఈ ఇన్ఫెక్షన్ కారణంగా దురద, మంట, తెల్ల బట్ట వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అదే విధంగా మూత్రపిండాల్లో రాళ్లు, కాలేయ సమస్యలు ఉన్నా కూడా మూత్రం ఘాటైన వాసన, రంగును కలిగి ఉంటుంది. అదే విధంగా డయాబెటిస్ ఉన్న వారిలో ఉన్నా కూడా లేదా డయాబెటిస్ ఉన్నప్పటికి గుర్తించని వారిలో కూడా మూత్రం రంగు, వాసనలో మార్పులు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. డయాబెటిస్ ఉన్న వారిలో మూత్రం తియ్యటి పండ్ల వాసనను కలిగి ఉంటుందని అలాగే తరచూ మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వస్తుందని వారు చెబుతున్నారు. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యున్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం మంచిదని వారు సూచిస్తున్నారు.