Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home food

Mango Chutney : ప‌చ్చి మామిడికాయ‌ల‌తో చ‌ట్నీ.. త‌యారీ ఇలా.. ఎంతో రుచిగా ఉంటుంది..!

Editor by Editor
May 6, 2023
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Mango Chutney : వేసవికాలం వచ్చిందంటే పచ్చిమామిడికాయలు తినడానికి ఎంతో ఇష్టపడతారు. ఈ క్రమంలోనే పచ్చి మామిడి కాయలతో తయారు చేసే పచ్చడి అంటే ప్రతి ఒక్కరు లొట్టలేసుకుంటూ తింటారు. ఎంతో రుచికరమైన పచ్చి మామిడికాయ పచ్చడి తయారు చేయడం ఏ విధంగానో ఇక్కడ తెలుసుకుందాం. దీన్ని కింద చెప్పిన విధంగా చేయాలేగానీ ఎంతో రుచిగా ఉంటుంది. అంద‌రూ ఇష్ట‌ప‌డ‌తారు. దీన్ని టిఫిన్స్ లేదా అన్నంలోనూ తిన‌వ‌చ్చు. ఒక్క‌సారి టేస్ట్ చేశారంటే మ‌ళ్లీ ఇలాగే చేసుకుంటారు.

ప‌చ్చి మామిడికాయ చ‌ట్నీ తయారీకి కావలసిన పదార్థాలు..

పచ్చి మామిడికాయ – ఒకటి, ఎండు మిర్చి – 4, జీల‌క‌ర్ర – 1 టేబుల్ స్పూన్‌, ఉప్పు – త‌గినంత‌, క‌రివేపాకు – 1 రెమ్మ‌, ఆవాలు – 1 టీస్పూన్‌, వెల్లుల్లి రెబ్బ‌లు – 4, ఉల్లిపాయ ముక్క‌లు – అర క‌ప్పు, నూనె – త‌గినంత‌.

Mango Chutney recipe in telugu make in this method
Mango Chutney

ప‌చ్చి మామిడికాయ చట్నీని త‌యారు చేసే విధానం..

ముందుగా పచ్చి మామిడికాయను పైన తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. స్టౌ పై కడాయి పెట్టి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి కరివేపాకులు, జీలకర్ర, 3 ఎండు మిరపకాయలు వేసి దోరగా వేయించాలి. మామిడికాయ ముక్కలు, వేయించి పెట్టుకున్న మిశ్రమాన్ని మిక్సీలో కాకుండా రోటిలో మెత్తగా రుబ్బుకోవాలి. మరొక కడాయిలో పోపు కోసం కొద్దిగా నూనె వేయాలి. నూనె వేడెక్కాక ఆవాలు, కరివేపాకు, ఎండు మిర్చి ముక్కలు, వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఆవాలు చిటపట అన్న తరువాత ముందుగా రుబ్బి పెట్టుకున్న మామిడికాయ పచ్చడిని ఆ కడాయిలో వేసి రెండు నిమిషాల పాటు సిమ్ లో ఉడకనివ్వాలి. ఈ విధంగా మామిడికాయ పచ్చడిని ఉడికించడం వల్ల పచ్చి వాసన రాదు. రెండు నిమిషాల తర్వాత స్టౌ ఆఫ్ చేస్తే ఎంతో రుచికరమైన మామిడికాయ పచ్చడి తయారైనట్లే. ఈ మామిడికాయ పచ్చడిని వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే ప్లేట్ మొత్తం ఖాళీ చేయాల్సిందే.

Tags: Mango Chutney
Previous Post

Sleep : రోజుకు మ‌న‌కు అస‌లు ఎన్ని గంట‌ల నిద్ర అవ‌సరం.. సైంటిస్టులు ఏమ‌ని చెబుతున్నారు..?

Next Post

Coconut Halwa : కొబ్బ‌రి హ‌ల్వాను ఇలా చేసి ఎప్పుడైనా తిన్నారా.. ఎంతో రుచిగా ఉంటుంది..!

Related Posts

lifestyle

బుల్లెట్ బైక్‌ నే దేవుడిగా చేసి, పూజలు చేస్తున్న గ్రామస్తులు, దీని వెనక పెద్ద కథే ఉంది.!

July 4, 2025
హెల్త్ టిప్స్

రాత్రి పూట ఇలా చేస్తే ప‌డుకున్న వెంట‌నే నిద్ర ప‌ట్టేస్తుంది..!

July 4, 2025
వైద్య విజ్ఞానం

భార‌తీయ మ‌హిళ‌ల్లో పెరుగుతున్న గ‌ర్భాశ‌య క్యాన్స‌ర్‌.. ఈ ల‌క్ష‌ణాలు ఉంటే జాగ్ర‌త్త‌..!

July 4, 2025
వైద్య విజ్ఞానం

మీకు డ‌యాబెటిస్ ఉందా..? అయితే మీ చ‌ర్మం ఆరోగ్యం ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే..!

July 4, 2025
international

పాకిస్థాన్‌తో భార‌త్ ర‌ద్దు చేసుకున్న నీటి ఒప్పందం క‌రెక్టే అంటారా..?

July 4, 2025
business

ఎలాన్ మస్క్‌ను నేటి తరంలో అత్యుత్తమ శాస్త్రవేత్త అనవచ్చా? కేవలం వ్యాపారవేత్త అనుకోవాలా?

July 4, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.