Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home పోష‌కాహారం పండ్లు

Seema Chinthakaya : ఈ కాయ‌ల గురించి తెలుసు క‌దా.. వీటిని తిన‌డం మాత్రం మ‌రిచిపోకండి..!

D by D
May 24, 2023
in పండ్లు, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Seema Chinthakaya : మ‌నకు వివిధ ర‌కాల పండ్లు, కూర‌గాయ‌లు కాలానుగుణంగా ల‌భిస్తూ ఉంటాయి. ఇలా కాలానుగుణంగా ల‌భించే పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌నం ఆ కాలంలో వ‌చ్చే అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డ‌కుండా మ‌న‌ల్ని మ‌నం కాపాడుకోవ‌చ్చు. ఇలా కాలానుగుణంగా ల‌భించే వివిధ ర‌కాల పండ్లల్లో సీమ చింత‌కాయ‌లు కూడా ఒక‌టి. వేస‌వి కాలంలో ఇవి ఎక్కువ‌గా ల‌భిస్తాయి. గ్రామాల్లో ఉండే వారికి వీటి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. ఈ కాయ‌లు పొన చ‌ర్మం గులాడి, ఎరుపు రంగుల్లో ఉంటుంది. లోప‌ల తెల్ల‌గా ఉండే గుజ్జుతో పాటు న‌ల్ల రంగులో ఉండే గింజ కూడా ఉంటుంది. ఈ తెల్ల గుజ్జును మాత్ర‌మే మ‌నం ఆహారంగా తీసుకోవాలి.

అలాగే ఈ కాయ‌లు తీపి, వ‌గ‌రు రుచిని క‌లిగి ఉంటాయి. వీటిని చాలా మంది ఇష్టంగా తింటారు. ఈ సీమ చింత‌కాయ‌ల‌ను జింగిలం జిలేజి అని కూడా పిలుస్తూ ఉంటారు. రుచితో పాటు ఈ కాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. వీటిలో పీచు ప‌దార్థాలు, ప్రోటీన్స్ ఎక్కువ‌గా ఉంటాయి. కొవ్వులు చాలా త‌క్కువ మోతాదులో ఉంటాయి. అలాగే ఈ సీమ చింత‌కాయ‌ల్లో విట‌మిన్ బి1, బి6, ఎ, సి వంటి విట‌మిన్స్ కూడా ఉంటాయి. ఈ కాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. ర‌క్తం శుద్ది అవుతుంది. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ప్రోటీన్స్ ల‌భ్య‌మ‌వుతాయి. దీనిలో ఉండే ఫైబ‌ర్ జీర్ణశ‌క్తిని మెరుగుప‌ర‌చ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది.

Seema Chinthakaya benefits in telugu do not forget to take them
Seema Chinthakaya

అలాగే సీమ చింత‌కాయ‌ల‌ను బాగా న‌మిలి తిన‌డం వ‌ల్ల దంతాలు శుభ్ర‌ప‌డ‌తాయి. ఎముకల‌ను ధృడంగా చేయ‌డంలో కూడా ఈ కాయ‌లు మ‌నకు స‌హాయ‌ప‌డ‌తాయి. బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. కంటి ఆరోగ్యాన్ని మెరుగుప‌రిచి, కంటి చూపును పెంచ‌డంలో కూడా ఈ కాయ‌లు మ‌న‌కు స‌హాయ‌ప‌డ‌తాయి. అదే విధంగా గ‌ర్భిణీ స్త్రీలు, పాలిచ్చే త‌ల్లులు వీటిని తీసుకోవ‌డం వల్ల మ‌రింత మేలు క‌లుగుతుంది. శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోషకాలన్నీ చ‌క్క‌గా అందుతాయి. గ‌ర్భిణీ స్త్రీల‌ల్లో వ‌చ్చే మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య‌ను త‌గ్గించ‌డంలో ఈ కాయ‌లు ఎంతో ఉప‌యోగ‌ప‌డ‌తాయి.

ఈ కాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల నాడీ మండ‌ల వ్య‌వ‌స్థ ప‌నితీరు మెరుగుప‌డుతుంది. ర‌క్త‌నాళాలు చ‌క్క‌గా ప‌ని చేస్తాయి. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు త‌గ్గుతాయి. ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. గుండె స‌మ‌స్య‌లు మ‌న ద‌రి చేర‌కుండా ఉంటాయి. అంతేకాకుండా ఈ సీమ‌చింత‌కాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల ఒత్తిడి, ఆందోళ‌న వంటి స‌మ‌స్య‌లు త‌గ్గి ప్ర‌శాంత‌త ల‌భిస్తుంది. ఈ విధంగా సీమ చింత‌కాయ‌లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌ని ఇవి ల‌భించే కాలంలో వీటిని త‌ప్ప‌కుండా తీసుకోవాల‌ని నిపుణులు చెబుతున్నారు.

Tags: Seema Chinthakaya
Previous Post

Ragi Uttapam : రాగి ఊతప్పం.. రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఇన్‌స్టంట్‌గా ఇలా వేసుకోవచ్చు..!

Next Post

Strawberry Lassi : స్ట్రాబెర్రీలతో లస్సీ తయారీ ఇలా.. టేస్ట్‌ చూస్తే ఇలాగే కావాలంటారు..!

Related Posts

వినోదం

70 ఏళ్ల వ‌య‌స్సులోనూ ర‌జ‌నీకాంత్ అంత ఫిట్‌గా ఉన్నారంటే..? ఆయ‌న పాటించే దిన‌చ‌ర్య ఎలాంటిదంటే..?

July 4, 2025
technology

స్మార్ట్‌ఫోన్ల పై భాగంలో ఉండే రంధ్రాన్ని ఎప్పుడైనా గ‌మ‌నించారా..? అదేమిటో తెలుసా..?

July 4, 2025
lifestyle

బుల్లెట్ బైక్‌ నే దేవుడిగా చేసి, పూజలు చేస్తున్న గ్రామస్తులు, దీని వెనక పెద్ద కథే ఉంది.!

July 4, 2025
హెల్త్ టిప్స్

రాత్రి పూట ఇలా చేస్తే ప‌డుకున్న వెంట‌నే నిద్ర ప‌ట్టేస్తుంది..!

July 4, 2025
వైద్య విజ్ఞానం

భార‌తీయ మ‌హిళ‌ల్లో పెరుగుతున్న గ‌ర్భాశ‌య క్యాన్స‌ర్‌.. ఈ ల‌క్ష‌ణాలు ఉంటే జాగ్ర‌త్త‌..!

July 4, 2025
వైద్య విజ్ఞానం

మీకు డ‌యాబెటిస్ ఉందా..? అయితే మీ చ‌ర్మం ఆరోగ్యం ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే..!

July 4, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.