Gongura Chicken Curry : చికెన్ తో మనం రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాము. చికెన్ తో చేసే ఏ వంటకమైనా చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది చికెన్ వంటకాలను ఇష్టంగా తింటారు. చికెన్ తో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో గోంగూర చికెన్ కూడా ఒకటి. గోంగూర చికెన్ చాలా రుచిగా ఉంటుంది. మనకు రెస్టారెంట్ లలో ఈ వంటకం ఎక్కువగా లభిస్తూ ఉంటుంది. ఈ గోంగూర చికెన్ ను మనం ఇంట్లో కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా, కమ్మగా ఉండే ఈ గోంగూర చికెన్ ను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
గోంగూర చికెన్ కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
చికెన్ – అరకిలో, గోంగూర – 2 కట్టలు, తరిగిన పచ్చిమిర్చి – 5, పొడుగ్గా తరిగిన పెద్ద ఉల్లిపాయలు – 2, కరివేపాకు – రెండురెమ్మలు, కారం – ఒకటిన్నర టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత, జీలకర్ర పొడి -అర టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, నూనె – 3 టేబుల్ స్పూన్స్, టమాట – 1, పసుపు – అర టీ స్పూన్, ఎండుమిర్చి -3.
గోంగూర చికెన్ కర్రీ తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. వీటిని రంగు మారే వరకు వేయించిన తరువాత పసుపు వేసి కలపాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత టమాట ముక్కలు వేసి అవి మెత్తబడే వరకు వేయించాలి. తరువాత జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం, ఉప్పు వేసి కలపాలి. తరువాత గోంగూర వేసి కలపాలి. తరువాత దీనిపై మూత పెట్టి గోంగూర మెత్తగా అయ్యే వరకు మగ్గించాలి. గోంగూర మగ్గిన తరువాత శుభ్రం చేసుకున్న చికెన్ ను వేసుకుని కలపాలి. తరువాత దీనిపైమూత పెట్టి 5 నిమిషాల పాటు మగ్గించాలి. తరువాత మూత తీసి తగినన్ని నీళ్లు పోసి కలపాలి.
ఇప్పుడు చికెన్ మెత్తగా ఉడికి దగ్గర పడిన తరువాత గరం మసాలా వేసి కలపాలి. దీనిని మరో నిమిషం పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే గోంగూర చికెన్ తయారవుతుంది. దీనిని అన్నం, రోటీ, పులావ్ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. చికెన్ తో తరచూ చేసే వంటకాలతో పాటు అప్పుడప్పుడూ ఇలా గోంగూర చికెన్ ను కూడా తయారు చేసుకుని తినవచ్చు. ఈ విధంగా తయారు చేసిన చికెన్ ను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.