Varicose Veins : నేటి తరుణంలో కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్, తలనొప్పి, కండరాల నొప్పులు, రుమటాయిడ్ ఆర్థరైటిస్, మోకాళ్ల నొప్పులు, వెరికోస్ వెయినప్స్ ఇలాంటి అనారోగ్య సమస్యలతో బాధపడే వారు ఎక్కువవుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా అందరూ ఈ సమస్యల బారిన పడుతున్నారు. మారిన మన జీవన విధానం, ఆహారపు అలవాట్లు, క్యాల్షియం లోపించడం వంటి వివిధ కారణాల చేత ప్రజలు ఈ సమస్యల బారిన పడుతూ ఉంటారు. ఈ సమస్యలను తగ్గించుకోవడానికి అనేక రకాల మందులను వాడుతూ ఉంటారు. మందులను వాడడం వల్ల నొప్పులు తగ్గినప్పటికి వాటి వల్ల దుష్ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ నొప్పులు మరలా తిరగబడతాయి. ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా సహజ సిద్దంగా లభించే పదార్థాలతో నూనెను తయారు చేసుకుని వాడడం వల్ల మనం చాలా సులభంగా నొప్పులను తగ్గించుకోవచ్చు.
ఈ నూనెను తయారు చేసుకోవడం కూడా చాలా సులభం. కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ వంటి సమస్యలను తగ్గించే ఈ నూనెను ఎలా తయారు చేసుకోవాలి..తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ నూనును తయారు చేసుకోవడానికి గానూ మనం వెల్లుల్లి పాయను, ఉల్లిపాయను, అల్లాన్ని, కళోంజి విత్తనాలను, ఆలివ్ నూనెను ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా వెల్లుల్లి పాయ అంచులను తీసేసి పొట్టుతో సహా ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే మధ్యస్థంగా ఉండే ఉల్లిపాయ అంచులను కూడా తీసేసి పొట్టుతో సహా ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే 30 గ్రాముల అల్లాన్ని తీసుకుని దానిపై ఉండే పొట్టును తీసి వేయాలి. తరువాత ఈ అల్లాన్ని కూడా ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఇప్పుడు వీటన్నింటిని వెడల్పుగా అలాగే మూత ఉండే గాజు జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ కళోంజి విత్తనాలను వేయాలి. ఇప్పుడు ఈ గాజు జార్ నిండే వరకు ఆలివ్ ఆయిల్ ను పోయాలి. ఇప్పుడు ఒక గిన్నెలో మందపాటి వస్త్రాన్ని రెండు పొరలుగా వేసి ఉంచాలి. తరువాత దీనిలో ముందుగా సిద్దం చేసుకున్న గాజు జార్ ను ఉంచి గిన్నె నిండే వరకు నీటిని పోయాలి. ఇప్పుడు ఈ నీటిని 30 నిమిషాల పాటు బాగా వేడి చేయాలి. 30 నిమిషాల పాటు వేడి చేసిన తరువాత గాజు జార్ ను బయటకు తీసి పూర్తిగా చల్లారనివ్వాలి. తరువాత దీనిని వారం రోజుల పాటు కదిలించకుండా అలాగే ఉంచాలి.
వారం రోజుల తరువాత ఈ ఆలివ్ ఆయిల్ ను వడకట్టి నిల్వ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న నూనెను నొప్పి ఉన్న చోట రాసి సున్నితంగా మర్దనా చేసుకోవాలి. తరువాత వేడిగా ఉండేలా వస్త్రంతో కట్టుకట్టుకోవాలి. ఇలా రోజూ ఉదయం అలాగే రాత్రి పడుకునే ముందు ఈ నూనెను రాసుకోవాలి. వెరికోస్ వెయిన్స్ తో బాధపడే వారు ఈ నూనెను కాళ్ల కింది నుండి పైకి రాసుకుని వస్త్రాన్ని కట్టుకోవాలి. ఇలా రోజుకు రెండు సార్లు ఈ నూనెను రాసుకోవడం వల్ల మనం చాలా సులభంగా అన్ని రకాల నొప్పులను తగ్గించుకోవచ్చు. ఈ నూనెను వాడడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. అలాగే నొప్పుల నుండి ఉపశమనం కూడా కలుగుతుంది.