Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home food

Sweet Red Chutney : ఇడ్లీలలోకి ఎర్ర‌గా ఉండే తియ్య‌ని చ‌ట్నీని ఇలా చేయండి.. రుచి సూప‌ర్ అంటారు..!

D by D
June 28, 2023
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Sweet Red Chutney : మ‌నం ఉద‌యం పూట అల్పాహారాల‌ను తిన‌డానికి ప‌ల్లీ చ‌ట్నీ, కొబ్బ‌రి చ‌ట్నీ, ట‌మాట చ‌ట్నీ ఇలా ర‌క‌ర‌కాల చ‌ట్నీల‌ను తయారు చేస్తూ ఉంటాము. చ‌ట్నీతో తింటేనే ఏ అల్పాహారాలైనా రుచిగా ఉంటాయి. మ‌నం ఎప్పుడూ చేసే ఈ చ‌ట్నీల‌ను తిని తిని బోర్ కొట్టిన వారు కింద చెప్పిన విధంగా రుచిక‌ర‌మైన రెడ్ చ‌ట్నీని త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఎండు మిర‌ప‌కాయ‌ల‌తో చేసే ఈ చ‌ట్నీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డానికి ఎక్కువ‌గా స‌మ‌యం కూడా ప‌ట్టదు. ఇడ్లీ, దోశ ఇలా దేనితోనైనా ఈ చ‌ట్నీని తిన‌వ‌చ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ రెడ్ చ‌ట్నీని ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

రెడ్ చ‌ట్నీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

బెల్లం -ఒక చిన్న ముక్క‌, ఉప్పు – త‌గినంత‌, నూనె – ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 6, చింత‌పండు – చిన్న నిమ్మ‌కాయంత‌, వెల్లుల్లి రెబ్బ‌లు – 4, ఆవాలు – అర టీ స్పూన్, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, మెంతులు – పావు టీ స్పూన్, ధ‌నియాలు – 4 టీ స్పూన్, త‌రిగిన ఉల్లిపాయ – 1, క‌రివేపాకు -ఒక రెమ్మ‌.

Sweet Red Chutney recipe in telugu tastes better with idli
Sweet Red Chutney

రెడ్ చ‌ట్నీ త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత ఎండుమిర్చి,జీల‌క‌ర్ర‌, ఆవాలు, మెంతులు, ధ‌నియాలు వేసి వేయించాలి. వీటిని దోర‌గా వేయించిన త‌రువాత క‌రివేపాకు వేసి క‌లపాలి. త‌రువాత కొద్దిగా చింత‌పండు, పావు గ్లాస్ నీళ్లు పోసి 10 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. త‌రువాత వీటిని నీటితో స‌హా ఒక జార్ లోకి తీసుకోవాలి. త‌రువాత ఇందులో మిగిలిన ప‌దార్థాల‌న్ని వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. ఈ చ‌ట్నీని గిన్నెలోకి తీసుకుని నేరుగా స‌ర్వ్ చేసుకోవ‌చ్చు లేదా తాళింపు వేసుకుని స‌ర్వ్ చేసుకోవ‌చ్చు. ఈ విధంగా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే రెడ్ చ‌ట్నీ త‌యారవుతుంది. దీనిని ఉద‌యం చేసుకునే ఏ అల్పాహారంతో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. త‌ర‌చూ చేసే ప‌ల్లీ చ‌ట్నీ, కొబ్బ‌రి చ‌ట్నీతో పాటు ఇలా రెడ్ చ‌ట్నీని కూడా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు.

Tags: Sweet Red Chutney
Previous Post

Peaches : ఈ పండ్ల గురించి తెలుసా.. కంటి చూపు పెరుగుతుంది.. గుండె సేఫ్‌..!

Next Post

Wheat Flour Breakfast : అప్ప‌టిక‌ప్పుడు ఇన్‌స్టంట్‌గా ఎంతో రుచిగా బ్రేక్‌ఫాస్ట్‌ను ఇలా చేసుకోవ‌చ్చు..!

Related Posts

ఆధ్యాత్మికం

మీ ఇంటి వద్ద‌కు వ‌చ్చి కాకి ప‌దే ప‌దే అరుస్తుందా..? దాని అర్థం ఏమిటంటే..?

July 4, 2025
ఆధ్యాత్మికం

దేశంలో ఉన్న 18 అష్టాద‌శ శ‌క్తి పీఠాలు ఎక్క‌డ ఉన్నాయి..? అవి ఏమిటి..?

July 4, 2025
ఆధ్యాత్మికం

దీపారాధ‌న‌కు అస‌లు ఏ నూనె వాడాలి..? దీపారాధ‌న ఎలా చెయ్యాలి..?

July 4, 2025
వినోదం

70 ఏళ్ల వ‌య‌స్సులోనూ ర‌జ‌నీకాంత్ అంత ఫిట్‌గా ఉన్నారంటే..? ఆయ‌న పాటించే దిన‌చ‌ర్య ఎలాంటిదంటే..?

July 4, 2025
technology

స్మార్ట్‌ఫోన్ల పై భాగంలో ఉండే రంధ్రాన్ని ఎప్పుడైనా గ‌మ‌నించారా..? అదేమిటో తెలుసా..?

July 4, 2025
lifestyle

బుల్లెట్ బైక్‌ నే దేవుడిగా చేసి, పూజలు చేస్తున్న గ్రామస్తులు, దీని వెనక పెద్ద కథే ఉంది.!

July 4, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.