Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home food

Palakura Pappu : పాల‌కూర ప‌ప్పు రుచిగా రావాలంటే ఇలా చేయండి..!

D by D
July 2, 2023
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Palakura Pappu : పాల‌కూర‌.. మ‌నం ఆహారంగా తీసుకునే ఆకుకూర‌ల్లో ఇది కూడా ఒక‌టి. పాల‌కూర మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. పాల‌కూర‌తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. పాల‌కూర‌తో ఎక్కువ‌గా చేసే వంటకాల్లో పాల‌కూర ప‌ప్పు కూడా ఒక‌టి. పాల‌కూర ప‌ప్పు చాలా రుచిగా ఉంటుంది. ఈ ప‌ప్పును ఇష్ట‌ప‌డని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. పాల‌కూర ప‌ప్పును త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. ఎవ‌రైనా చాలా తేలిక‌గా దీనిని త‌యారు చేసుకోవ‌చ్చు. మ‌రింత రుచిగా, క‌మ్మ‌గా పాల‌కూర ప‌ప్పును ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

పాల‌కూర పప్పు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

కందిప‌ప్పు – ఒక క‌ప్పు, నీళ్లు – రెండున్న‌ర క‌ప్పులు, ప‌సుపు – అర టీ స్పూన్, త‌రిగిన ఉల్లిపాయ – 1, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 6 లేదా త‌గిన‌న్ని, చింత‌పండు – నిమ్మకాయంత‌, త‌రిగిన పాల‌కూర – 3 క‌ట్ట‌లు, నూనె – ఒక టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌.

Palakura Pappu how to make this very tasty
Palakura Pappu

తాళింపు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె- ఒక టేబుల్ స్పూన్, ఆవాలు- అర టీ స్పూన్, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బ‌లు – 6, ఎండుమిర్చి – 2, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, ఇంగువ – కొద్దిగా.

పాల‌కూర ప‌ప్పు త‌యారీ విధానం..

ముందుగా కుక్క‌ర్ లో కందిప‌ప్పును తీసుకుని శుభ్రంగా క‌డ‌గాలి. త‌రువాత ఇందులో ఉప్పు త‌ప్ప మిగిలిన ప‌దార్థాలు వేసి క‌ల‌పాలి. త‌రువాత కుక్క‌ర్ మూత పెట్టి 3 నుండి 4 విజిల్స్ వ‌చ్చే వ‌ర‌కు ఉడికించి స్ట‌వ్ ఆప్ చేసుకోవాలి. త‌రువాత ప‌ప్పును మెత్త‌గా చేసుకోవాలి. ఇందులో త‌గినంత ఉప్పు వేసి క‌ల‌పాలి. ఇప్పుడు క‌ళాయిలో తాళింపుకు నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక తాళింపు దినుసుల‌ను ఒక్కొక్క‌టిగా వేసి వేయించాలి. తాళింపు చ‌క్క‌గా వేగిన త‌రువాత దీనిని ప‌ప్పులో వేసి క‌ల‌పాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే పాల‌కూర ప‌ప్పు త‌యార‌వుతుంది. దీనిని అన్నంతో పాటు చ‌పాతీ, రోటీ వంటి వాటితో కూడా తిన‌వ‌చ్చు. ఈ ప‌ప్పును అంద‌రూ లొట్ట‌లేసుకుంటూ తింటారు. ఈ ప‌ప్పును తిన‌డం వ‌ల్ల మ‌నం రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు.

Tags: Palakura Pappu
Previous Post

Mango Flower : ఇది అంద‌రికీ తెలిసిందే.. దీన్ని తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Next Post

Potato Fingers : కేవ‌లం 10 నిమిషాల్లో ఆలుతో ఇలా స్నాక్స్ చేయండి.. రుచిగా ఉంటాయి..!

Related Posts

ఆధ్యాత్మికం

మీ ఇంటి వద్ద‌కు వ‌చ్చి కాకి ప‌దే ప‌దే అరుస్తుందా..? దాని అర్థం ఏమిటంటే..?

July 4, 2025
ఆధ్యాత్మికం

దేశంలో ఉన్న 18 అష్టాద‌శ శ‌క్తి పీఠాలు ఎక్క‌డ ఉన్నాయి..? అవి ఏమిటి..?

July 4, 2025
ఆధ్యాత్మికం

దీపారాధ‌న‌కు అస‌లు ఏ నూనె వాడాలి..? దీపారాధ‌న ఎలా చెయ్యాలి..?

July 4, 2025
వినోదం

70 ఏళ్ల వ‌య‌స్సులోనూ ర‌జ‌నీకాంత్ అంత ఫిట్‌గా ఉన్నారంటే..? ఆయ‌న పాటించే దిన‌చ‌ర్య ఎలాంటిదంటే..?

July 4, 2025
technology

స్మార్ట్‌ఫోన్ల పై భాగంలో ఉండే రంధ్రాన్ని ఎప్పుడైనా గ‌మ‌నించారా..? అదేమిటో తెలుసా..?

July 4, 2025
lifestyle

బుల్లెట్ బైక్‌ నే దేవుడిగా చేసి, పూజలు చేస్తున్న గ్రామస్తులు, దీని వెనక పెద్ద కథే ఉంది.!

July 4, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.