Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home food

Hotel Style Mixed Vegetable Curry : హోట‌ల్ స్టైల్‌లో మిక్స్‌డ్ వెజిట‌బుల్ కర్రీని ఇలా చేయండి.. చ‌పాతీల్లోకి బాగుంటుంది..!

D by D
July 12, 2023
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Hotel Style Mixed Vegetable Curry : మ‌నం చ‌పాతీ, రోటీ, నాన్, పూరీ, బ‌ట‌ర్ నాన్ వంటి వాటిని తిన‌డానికి ర‌క‌ర‌కాల కూర‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. చ‌పాతీ, నాన్ వంటి వాటిని కూర‌ల‌తో తింటేనే మ‌రింత రుచిగా ఉంటాయి. ఈచ‌పాతీల‌ల్లోకి ఒక్కో కూర‌గాయ‌ను ఉప‌యోగించి ఒక్కో కూర కాకుండా అన్ని కూర‌గాయ‌ల‌ను క‌లిపి మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీని త‌యారు చేసుకోవచ్చు. ఈ క‌ర్రీలో ఏ కూర‌గాయ‌నైనా వాడుకోవ‌చ్చు. అలాగే దీనిని తిన‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. రుచిగా ఉండ‌డంతో పాటు మ‌న ఆరోగ్యానికి మేలు చేసే ఈ మిక్స్డ్ వెజిటేబుల్ క‌ర్రీని ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మిక్స్డ్ వెజిటేబుల్ క‌ర్రీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె -అర క‌ప్పు, జీల‌క‌ర్ర -ఒక టీ స్పూన్, జీడిప‌ప్పు – 15, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 4, పొడువుగా త‌రిగిన ఉల్లిపాయ ముక్క‌లు – ఒక క‌ప్పు, బంగాళాదుంప ముక్క‌లు – ఒక కప్పు, త‌రిగిన క్యారెట్ ముక్క‌లు -ఒక క‌ప్పు, ప‌సుపు -అర టీ స్పూన్, బీన్స్ ముక్క‌లు -అర‌క‌ప్పు, క్యాలీ ప్ల‌వ‌ర్ ముక్క‌లు – అర క‌ప్పు, ప‌చ్చి బ‌ఠాణీ – అర క‌ప్పు, ట‌మాట ముక్క‌లు -ఒక క‌ప్పు, ఉప్పు – త‌గినంత‌, కారం – 3 టీ స్పూన్స్, వేడి నీళ్లు – అర క‌ప్పు, చిలికిన పెరుగు -ఒక క‌ప్పు.

Hotel Style Mixed Vegetable Curry tastes better with chapati
Hotel Style Mixed Vegetable Curry

మ‌సాలా పేస్ట్ కు కావ‌ల్సిన ప‌దాక‌ర్థాలు..

ధ‌నియాలు – 2టేబుల్ స్పూన్స్, యాల‌కులు – 3, దాల్చిన చెక్క -ఒక ఇంచు ముక్క‌, ల‌వంగాలు – 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2 టేబుల్ స్పూన్స్, ప‌చ్చి కొబ్బ‌రి ముక్క‌లు – పావు క‌ప్పు, గ‌స‌గ‌సాలు – 2 టేబుల్ స్పూన్స్.

మిక్స్డ్ వెజిటేబుల్ క‌ర్రీ త‌యారీ విధానం..

ముందుగా జార్ లో మ‌సాలా పేస్ట్ కు కావ‌ల్సిన ప‌దార్థాలు వేసి త‌గిన‌న్ని నీళ్లు పోసి మెత్త‌గా పేస్ట్ లాగా చేసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక జీల‌కర్ర‌, జీడిప‌ప్పు వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ‌, ప‌చ్చిమిర్చి, బంగాళాదుంప ముక్క‌లు వేసి వేయించాలి. ఇవి కొద్దిగా వేగిన త‌రువాత క్యారెట్ ముక్క‌లు వేసి క‌ల‌పాలి. త‌రువాత ప‌సుపు వేసి క‌ల‌పాలి. త‌రువాత బీన్స్ వేసి క‌లపాలి. వీటిపై మూత పెట్టి 10 నిమిషాల‌పాటు వేయించాలి. త‌రువాత క్యాలీప్ల‌వ‌ర్ ముక్క‌లు, ప‌చ్చిబ‌ఠాణీ వేసి క‌ల‌పాలి.

వీటిని 3 నిమిషాల పాటు వేయించిన త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న పేస్ట్ వేసి క‌ల‌పాలి. త‌రువాత ట‌మాట ముక్క‌లు, ఉప్పు, కారం వేసి క‌ల‌పాలి. త‌రువాత నీళ్లు పోసి క‌లిపి మూత పెట్టాలి. వీటిని 10 నిమిషాల పాటు ఉడికించిన త‌రువాత పెరుగు వేసి క‌ల‌పాలి. దీనిపై మూత పెట్టి నూనె పైకి తేలే వ‌ర‌కు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే మిక్స్డ్ వెజిటేబుల్ క‌ర్రీ త‌యార‌వుతుంది. దీనిని చ‌పాతీ, రోటీ, పూరీ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ కూర‌ను తిన‌డం వ‌ల్ల రుచికి రుచిని ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు.

Tags: Hotel Style Mixed Vegetable Curry
Previous Post

Egg Masala Gravy : ఎగ్ మ‌సాలా గ్రేవీ క‌ర్రీని ఇలా చేయండి.. ఎందులోకి అయినా టేస్ట్ అదిరిపోతుంది..!

Next Post

Brahmadandi : రోడ్డు ప‌క్క‌న పెరిగే ఇది ముళ్ల ముక్కే.. కానీ దీన్ని పిచ్చి మొక్క అనుకుంటే పొర‌పాటు ప‌డిన‌ట్లే..!

Related Posts

ఆధ్యాత్మికం

కుంభ మేళాకు నాగ‌సాధువులు ల‌క్షలాదిగా ఒకేసారి వ‌చ్చి ఎలా వెళ్తారు..?

July 4, 2025
Off Beat

స‌హాయం చేసే వారంద‌రూ స్నేహితులు కారు.. గొప్ప క‌థ‌..!

July 4, 2025
mythology

ఫినిక్స్ పక్షి ప్రత్యేకత ఏమిటి ? ఇది వాస్తవంగా గతంలో మనుగడలో వుండిందా ? లేదా ఇదంతా కేవలం కాల్పానికమేనా ?

July 4, 2025
వైద్య విజ్ఞానం

షుగ‌ర్ వ్యాధి కంట్రోల్‌లో ఉండ‌క‌పోతే కిడ్నీలు చెడిపోతాయా..?

July 4, 2025
ఆధ్యాత్మికం

మీకు శ‌నిదోషం ఉందా..? అయితే ఈ ప‌రిహారాల‌ను పాటిస్తే మంచిది..!

July 3, 2025
ఆధ్యాత్మికం

ఏ వేలితో బొట్టు పెట్టుకుంటే ఎలాంటి ఫ‌లితాలు క‌లుగుతాయంటే..?

July 3, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.