Sorakaya Juice For Diabetes : షుగర్ వ్యాధితో బాధపడే వారు మనలో చాలా మంది ఉన్నారు. ఈ వ్యాధిని అదుపులో ఉంచుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పటికి షుగర్ వ్యాధి అదుపులోకి రాక ఇబ్బంది పడే వారు రోజూ ఒక గ్లాస్ ఈ జ్యూస్ ను తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఈ జ్యూస్ ను తాగడం వల్ల షుగర్ వ్యాధి గ్రస్తులకు ఎంతో మేలు కలుగుతుందని వారు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ జ్యూస్ ను తాగడం వల్ల శరీరంలో ఇన్ ప్లామేషన్ తగ్గుతుంది. చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. శరీరం డీహైడ్రేషన్ కు గురికాకుండా ఉంటుంది. జీరర్ణశక్తి మెరుగుపడుతుంది.
బరువు తగ్గడంలో, కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచడంలో కూడా ఈ జ్యూస్ మనకు సహాయపడుతుంది. అలాగే కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, శరీరంలో పేరుకుపోయిన మలినాలను తొలగించడంలో, మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలను తొలగించడంలో, శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో కూడా ఈ జ్యూస్ మనకు దోహదపడుతుంది. షుగర్ తో పాటు అనేక అనారోగ్య సమస్యలను తగ్గించే ఈ జ్యూస్ ను ఎలా తయారు చేసుకోవాలి… అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ జ్యూస్ ను తయారు చేసుకోవడానికి గానూ మనం సొరకాయను ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా ఒక చిన్న సొరకాయను తీసుకుని దానిపై ఉండే పొట్టును తీసేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి.
తరువాత ఈ ముక్కలను జార్ లో వేసి అందులో ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, ఒక ఇంచు తరిగిన అల్లం, పావు టీ స్పూన్ రాక్ సాల్ట్, ఒక గ్లాస్ నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా తయారు చేసుకున్న జ్యూస్ ను నేరుగా ఇలాగే తాగవచ్చు లేదా వడకట్టుకుని తాగవచ్చు. షుగర్ వ్యాధితో బాధపడే వారు ఇలా సొరకాయతో జ్యూస్ ని చేసి తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. షుగర్ వ్యాధి నియంత్రణలో ఉంటుంది. అలాగే శరీర ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుంది. ఈ జ్యూస్ లో వాడిన పదార్థాలన్నీ కూడా మనకు సులభంగా లభించేవే. అంతేకాకుండా ఈ పదార్థాలన్నీ కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేవే. కనుక ఈ జ్యూస్ ను తాగడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు కూడా ఉండవని నిపుణులు చెబుతున్నారు.