Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home food

Spicy Vankaya Curry : రెగ్యుల‌ర్‌గా చేసే వంకాయ క‌ర్రీ బోర్ కొట్టిందా.. ఇలా చేయండి.. రుచి అదిరిపోతుంది..!

D by D
August 28, 2023
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Spicy Vankaya Curry : మ‌నం వంకాయ‌ల‌తో ర‌క‌ర‌కాల వంట‌కాలను త‌యారు చేస్తూ ఉంటాము. వంకాయ‌ల‌తో చేసే ఏ వంట‌క‌మైనా చాలా రుచిగా ఉంటుంది. అలాగే వంకాయ‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. వంకాయ‌ల‌తో చేసుకోద‌గిన కూర‌లల్లో స్పైసీ వంకాయ కూర కూడా ఒక‌టి. ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. అలాగే దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. చాలా త‌క్కువ స‌మ‌యంలో చాలా సుల‌భంగా ఈ కూర‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. ఒక్క‌సారి రుచి చూస్తే మ‌ళ్లీ మ‌ళ్లీ ఇదే కావాల‌ని అడుగుతారు. మ‌రింత రుచిగా, స్పైసీగా వంకాయ కూర‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

స్పైసీ వంకాయ కూర త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

వంకాయ‌లు – పావుకిలో, త‌రిగిన ఉల్లిపాయ – 1, త‌రిగిన ట‌మాట – 1, అల్లం – ఒక ఇంచు ముక్క‌, వెల్లుల్లి రెబ్బ‌లు – 8, దాల్చిన చెక్క – ఒక చిన్న ముక్క‌, యాల‌క్కాయ – 1, ల‌వంగాలు – 2, నూనె – 2 టీ స్పూన్స్, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, ఉప్పు – తగినంత‌, ప‌సుపు – పావు టీ స్పూన్, కారం – 2 టీ స్పూన్స్, ధ‌నియాల పొడి – 2 టీ స్పూన్స్, చిలికిన పెరుగు – 4 టీ స్పూన్స్, నీళ్లు – అర క‌ప్పు, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Spicy Vankaya Curry recipe in telugu make in this way
Spicy Vankaya Curry

స్పైసీ వంకాయ కూర త‌యారీ విధానం..

ముందుగా వంకాయ‌ల‌ను క‌ట్ చేసి ఉప్పు నీటిలో వేసుకోవాలి. త‌రువాత ఒక జార్ లో ట‌మాట ముక్క‌లు, అల్లం, వెల్లుల్లి రెబ్బ‌లు, దాల్చిన చెక్క‌, యాల‌క్కాయ‌, ల‌వంగాలు వేసి మెత్త‌గా పేస్ట్ లాగా చేసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక వంకాయ ముక్క‌ల‌ను వేసి 4 నిమిషాల పాటు వేయించాలి. త‌రువాత వీటిని ప్లేట్ లోకి తీసుకుని ప‌క్క‌కు ఉంచాలి. ఇప్పుడు అదే క‌ళాయిలో తాళింపు దినుసులు వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు, క‌రివేపాకు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న ట‌మాట పేస్ట్ వేసి క‌ల‌పాలి. దీనిని నూనె పైకి తేలే వ‌ర‌కు వేయించిన త‌రువాత ఉప్పు, కారం, ప‌సుపు, ధ‌నియాల పొడి వేసి క‌ల‌పాలి. వీటిని అర నిమిషం పాటు వేయించిన త‌రువాత పెరుగు వేసి క‌ల‌పాలి.

దీనిని ఒక నిమిషం పాటు వేయించిన త‌రువాత నీళ్లు పోసి క‌ల‌పాలి. నీళ్లు మ‌రిగిన త‌రువాత వేయించిన వంకాయ ముక్క‌లు వేసి క‌ల‌పాలి. ఇప్పుడు మూత పెట్టి వంకాయ ముక్క‌లు ఉడికి నూనె పైకి తేలిన త‌రువాత కొత్తిమీర చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేడం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే స్పైసీ వంకాయ కూర త‌యార‌వుతుంది. దీనిని అన్నం, చ‌పాతీ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది. వంకాయ కూర‌ను ఇష్ట‌ప‌డని వారు కూడా ఈ కూర‌ను ఇష్టంగా తింటార‌నే చెప్ప‌వ‌చ్చు. త‌ర‌చూ ఒకేర‌కం వంకాయ కూర కాకుండా ఇలా వెరైటీగా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు.

Tags: Spicy Vankaya Curry
Previous Post

Thunakam Sweet : పాత‌కాలం నాటి సంప్ర‌దాయ తీపి వంట‌కం.. ఇలా చేయాలి.. ఎంతో రుచిగా ఉంటుంది..!

Next Post

Left Over Rice Murukulu : మిగిలిపోయిన అన్నాన్ని ప‌డేయ‌కండి.. ఇలా మురుకులు చేయండి..!

Related Posts

ఆధ్యాత్మికం

మీ ఇంటి వద్ద‌కు వ‌చ్చి కాకి ప‌దే ప‌దే అరుస్తుందా..? దాని అర్థం ఏమిటంటే..?

July 4, 2025
ఆధ్యాత్మికం

దేశంలో ఉన్న 18 అష్టాద‌శ శ‌క్తి పీఠాలు ఎక్క‌డ ఉన్నాయి..? అవి ఏమిటి..?

July 4, 2025
ఆధ్యాత్మికం

దీపారాధ‌న‌కు అస‌లు ఏ నూనె వాడాలి..? దీపారాధ‌న ఎలా చెయ్యాలి..?

July 4, 2025
వినోదం

70 ఏళ్ల వ‌య‌స్సులోనూ ర‌జ‌నీకాంత్ అంత ఫిట్‌గా ఉన్నారంటే..? ఆయ‌న పాటించే దిన‌చ‌ర్య ఎలాంటిదంటే..?

July 4, 2025
technology

స్మార్ట్‌ఫోన్ల పై భాగంలో ఉండే రంధ్రాన్ని ఎప్పుడైనా గ‌మ‌నించారా..? అదేమిటో తెలుసా..?

July 4, 2025
lifestyle

బుల్లెట్ బైక్‌ నే దేవుడిగా చేసి, పూజలు చేస్తున్న గ్రామస్తులు, దీని వెనక పెద్ద కథే ఉంది.!

July 4, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.