Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home food

Poha Vada : వేడి వేడిగా స్నాక్స్ తినాల‌నిపిస్తే.. ఇవి చేయండి.. 10 నిమిషాల్లో పూర్త‌వుతాయి..!

D by D
September 10, 2023
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Poha Vada : అటుకుల‌తో మ‌నం ర‌క‌ర‌కాల చిరుతిళ్ల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. అటుకులతో చేసే చిరుతిళ్లు చాలా రుచిగా ఉంటాయి. అలాగే చాలా సుల‌భంగా, చాలా త‌క్కువ స‌మ‌యంలో ఈ చిరుతిళ్ల‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. అటుకుల‌తో చేసుకోద‌గిన చిరుతిళ్ల‌ల్లో పోహ వ‌డ‌లు కూడా ఒక‌టి. అటుకుల‌తో చేసే ఈ వ‌డ‌లు చాలా రుచిగా ఉంటాయి. అలాగే చాలా క్రిస్పీగా ఉంటాయి. ఈ వ‌డ‌ల‌ను కేవ‌లం 20 నిమిషాల్లోనే త‌యారు చేసుకోవ‌చ్చు. అలాగే ఎవ‌రైనా చాలా తేలిక‌గా త‌యారు చేసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా, క్రిస్పీగా ఉండే ఈ పోహ వ‌డ‌ల‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

పోహ వ‌డ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

లావు అటుకులు – 2 క‌ప్పులు, చిన్న‌గా త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, త‌రిగిన ఉల్లిపాయ – 1, అల్లం త‌రుగు – ఒక టీ స్పూన్, త‌రిగిన కరివేపాకు – ఒక రెమ్మ‌, ఉప్పు – త‌గినంత‌, శ‌న‌గ‌పిండి – 2 టీ స్పూన్స్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, బియ్యంపిండి – 2 టేబుల్ స్పూన్స్, ప‌సుపు – కొద్దిగా, జీల‌క‌ర్ర పొడి – పావు టీ స్పూన్, ధ‌నియాల పొడి -ఒక టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకు స‌రిప‌డా.

Poha Vada recipe in telugu best evening snack
Poha Vada

పోహ వ‌డ త‌యారీ విధానం..

ముందుగా అటుకుల‌ను శుభ్రంగా క‌డగాలి.త‌రువాత ఇందులో త‌గినన్ని నీళ్లు పోసి 10 నిమిషాల పాటు నాన‌బెట్టాలి. త‌రువాత ఈ అటుకుల్లో ఉండే నీటిని పిండేస్తూ గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత ఇందులో నూనె త‌ప్ప మిగిలిన ప‌దార్థాల‌న్నీ వేసి బాగా క‌ల‌పాలి. అవ‌స‌ర‌మైతే కొద్దిగా నీటిని చ‌ల్లుకుంటూ క‌లుపుకోవాలి. త‌రువాత కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ వ‌డ‌లాగా వ‌త్తుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక వ‌డ‌ల‌ను వేసి వేయించాలి. వీటిని మ‌ధ్య‌స్థ మంట‌పై రెండు వైపులా ఎర్ర‌గా, క్రిస్పీగా అయ్యే వ‌ర‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే పోహ‌వ‌డ‌లు త‌యార‌వుతాయి. వీటిని ట‌మాట కిచ‌ప్ లేదా వేయించిన ప‌చ్చిమిర్చితో తింటే చాలా రుచిగా ఉంటాయి. వేడి వేడిగా ఏదైనా స్నాక్స్ తినాల‌నిపించిన‌ప్పుడు ఇలా అప్ప‌టిక‌ప్పుడు అటుకుల‌తో వ‌డ‌ల‌ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఈ వ‌డ‌ల‌ను ఒక్క‌టి కూడా విడిచిపెట్టకుండా ఇంట్లో అంద‌రూ తింటారు.

Tags: Poha Vada
Previous Post

Seema Vankaya Masala Curry : సీమ వంకాయ మ‌సాలా క‌ర్రీ.. రైస్‌, చ‌పాతీల్లోకి ఎంతో బాగుంటుంది..!

Next Post

Vanilla Cool Cake : ఓవెన్ లేకున్నా స‌రే.. వెనిల్లా కూల్ కేక్‌ను ఇంట్లోనే ఇలా చేసుకోండి..!

Related Posts

ఆధ్యాత్మికం

గాజులు ధరించడం వల్ల స్త్రీలకు ఎలాంటి లాభాలు ఉన్నాయో తెలుసా..?

June 8, 2025
వినోదం

మోక్షజ్ఞ జాతకంలో అది కలిసి రాదు అంటూ సంచలన కామెంట్స్ చేసిన వేణు స్వామి..!!

June 8, 2025
వినోదం

ఖుషి సినిమాలో నటించిన ముంతాజ్ ఇప్పుడెలా ఉందొ తెలుసా ? ఏమి చేస్తుందంటే ?

June 8, 2025
వైద్య విజ్ఞానం

డ‌యాబెటిస్ ఉన్న‌వారికి గుండె పోటు ఎందుకు వ‌స్తుంది..?

June 8, 2025
హెల్త్ టిప్స్

కేవలం పండ్లు లేదా వెజిట‌బుల్ జ్యూస్‌ల‌ను తాగితే క‌లిగే లాభాలు ఇవే..!

June 8, 2025
చిట్కాలు

త‌ల‌నొప్పి త‌గ్గేందుకు ఈ 4 ఆహారాలను తీసుకోవ‌చ్చు.. కానీ..?

June 8, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
lifestyle

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

by Admin
May 22, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!