Amritsar Halwa : అమృత్ సర్ హల్వా.. గోధుమపిండితో చేసే ఈ హల్వా చాలా రుచిగా ఉంటుంది. ఈ హల్వాను చాలా సులభంగా ఇన్ స్టాంట్ గా తయారు చేసుకోవచ్చు. చాలా తక్కువ శ్రమతో చాలా సులభంగా ఎవరైనా ఈ హల్వాను తయారు చేసుకోవచ్చు. దీనిని ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారని చెప్పవచ్చు. ఇంటికి అతిథులు వచ్చినప్పుడు చాలా సులభంగా చాలా త్వరగా ఈ హల్వాను తయారు చేసి సర్వ్ చేయవచ్చు. ఎంతో రుచిగా, కమ్మగా ఉండే ఈ అమృత్ సర్ హల్వాను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
అమృత్ సర్ హల్వా తయారీకి కావల్సిన పదార్థాలు..
నెయ్యి – ముప్పావు కప్పు, గోధుమపిండి -ఒక కప్పు, నీళ్లు – 2 కప్పులు, పటికబెల్లం పొడి – ఒక కప్పు లేదా తగినంత.
అమృత్ సర్ హల్వా తయారీ విధానం..
ముందుగా కళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. తరువాత గోధుమపిండి వేసి ఉండలు లేకుండా కలుపుతూ వేడి చేయాలి. ఇలా 15 నుండి 20 నిమిషాల పాటు ఉడికించిన తరువాత నీళ్లు పోసి కలపాలి. దీనిని దగ్గర పడే వరకు కలుపుతూ ఉడికించిన తరువాత పటికబెల్లం పొడి వేసి కలపాలి. అంతా కలిసేలా కలిపిన తరువాత మరలా కలుపుతూ ఉడికించాలి. ఈ మిశ్రమం చక్కగా ఉడికి నెయ్యి పైకి తేలిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే అమృత్ సర్ హల్వా తయారవుతుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. తీపి తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఇలా అరగంటలోనే హల్వాను తయారు చేసుకుని తినవచ్చు.