Late Sleep : మన శరీరానికి అవసరమయ్యే ముఖ్యమైన పోషకాల్లో ప్రోటీన్ కూడా ఒకటి. ప్రోటీన్ మన శరీరానికి చాలా అవసరం. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో, కండరాలను ధృడంగా, ఆరోగ్యంగా ఉంచడంలో, వివిధ రకాల ఎంజైమ్స్ మరియు హార్మోన్ల తయారీలో ఇలా అనేక రకాలుగా ప్రోటీన్ అవసరమవుతుంది. నేటి తరుణంలో చాలా మంది ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాలనే తీసుకుంటున్నారు. మన శరీర బరువు సమానమైన ప్రోటీన్ ను మనం రోజూ తీసుకోవాల్సి ఉంటుంది. అనగా ఒక కేజి బరువుకు ఒక గ్రాము ప్రోటీన్ చొప్పున మనం రోజూ తీసుకోవాలి. ప్రోటీన్ ఉండే ఆహారాలను తీసుకున్నప్పటికి కూడా మనలో చాలా మంది ప్రోటీన్ లోపంతో బాధపడుతున్నారు.
ఇలా ప్రోటీన్ లోపం తలెత్తడానికి గల వివిధ కారణాల్లో రాత్రిపూట ఆలస్యంగా నిద్రించడం కూడా ఒకటి. రాత్రి పూట ఆలస్యంగా నిద్రించడం వల్ల ప్రోటీన్ లోపం వస్తుందా.. అని ఆశ్యర్చపోతున్నారా.. కానీ ఇది నిజం.. ఆలస్యంగా నిద్రించడం వల్ల ప్రోటీన్ లోపం తలెత్తుతుందని నిపుణులు చెబుతున్నారు. మన శరీరంలో చనిపోయిన మృతకణాల్లో చాలా ప్రోటీన్ ఉంటుంది. ఇలా చనిపోయిన కణాల్లో ఉండే ప్రోటీన్ ను మన శరీరం తిరిగి వాడుకోగలదు. మన శరీరం చనిపోయిన మృతకణాలను విచ్చినం చేసి వాటిలో ఉండే ప్రోటీన్ ను తిరిగి శరీరానికి అందిస్తుంది. మన శరీరంలో రోజూ కొన్ని కోట్ల కణాలు చనిపోతూ ఉంటాయి. ఇలా చనిపోయిన కణాల నుండి వచ్చే ప్రోటీన్ ను మన శరీరం తిరిగి ఉపయోగించుకుంటుంది.
మన శరీరంలో ఈ ప్రక్రియ జరిగితేనే శరీరంలో ప్రోటీన్ లోపం తలెత్తకుండా ఉంటుంది. అయితే ఈ ప్రక్రియ మన శరీరంలో మనం నిద్రించిన తరువాత జరుగుతుంది. రాత్రి సమయంలో మన శరీరం విశ్రాంతిలో ఉన్నప్పుడు ఈ ప్రక్రియ జరుగుతుంది. అయితే మనం ఆలస్యంగా నిద్రించడం వల్ల ఈ ప్రక్రియ అనేది జరగదు. చనిపోయిన కణాల్లో ఉండే ప్రోటీన్ వ్యర్థాల ద్వారా బయటకు పోతుంది. దీంతో ప్రోటీన్ లోపం తలెత్తుతుంది. కనుక మనం రోజూ సాయంత్రం ఆహారాన్ని త్వరగా తీసుకుని త్వరగా నిద్రించడం అలవాటు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ప్రోటీన్ రీసైకిల్ అయ్యే ప్రక్రియ సమర్థవంతంగా జరుగుతుంది. దీంతో ప్రోటీన్ లోపం రాకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.